telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

వెస్టిండీస్‌ టెస్టు : … భారీ ఆధిక్యం దిశగా భారత్…

india with lead score on westindies series

టీమిండియా బ్యాట్స్‌మన్ ఆజింక్య రహానె వెస్టిండీస్‌తో తొలి టెస్టుల్లో శతకంతో చెలరేగాడు. టెస్టు క్రికెట్లో రహానెకిది పదో సెంచరీ కావడం విశేషం. 81/3తో కష్టాల్లో ఉన్న జట్టును రహానె ఆదుకున్నాడు. తొలుత విరాట్ కోహ్లీతో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పిన అతడు తర్వాత హనుమ విహారితో కలిసి భారీగా పరుగులు జోడించాడు. మరోఎండ్‌లో విహారీ కూడా సెంచరీకి చేరువలో ఉన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో 107 ఓవర్లు ఆడిన భారత్ 4 వికెట్లకు 320 పరుగులు చేసింది.

భారత్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని 395 పరుగుల ఆధిక్యంలో ఉంది. విండీస్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించి మిగిలిన రోజున్నర ఆటలో ఆలౌట్ చేయాలని భారత్ భావిస్తోంది. ప్రస్తుతం రహానె(102), విహారి(80) క్రీజులో ఉన్నారు. విరాట్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విహారి దూకుడుగా ఆడుతున్నాడు. సునాయాసంగా ఫోర్లు బాదడంతో పాటు ఒక సిక్సర్ కూడా కొట్టాడు. కుదురుకున్న జోడీని విడదీసేందుకు కరీబియన్ బౌలర్లు శ్రమిస్తున్నారు.

Related posts