telugu navyamedia
ఆంధ్ర వార్తలు

జ‌గ‌న్ ప్రభుత్వం ప్రజల పాలిట భస్మాసుర హస్తంగా మారింది..

వైఎస్ ఆర్ సీపీ నాయ‌కులు చేసిన అవ‌మానానికి తీవ్ర మ‌న‌స్తాపం చెందిన‌ చంద్రబాబు టీడీపీ పార్టీ ఆఫీస్‌ లో నిర్వహించిన ప్రెస్ మీట్లో బోరున ఏడ్చారు. ముఖ్యంగా తన భార్యను రాజకీయాల్లోకి లాగడంపై ఆయన ఆవేద‌న చెందారు. ‘నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి అవమానాలు ఎదుర్కోలేదని అన్నారు.

రెండున్నరేళ్లుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అవమానాలకు గురి చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలను హింసించేవారు.. బూతులు తిట్టారు.. అయినా భరించామని.. బీఏసీలో అచ్చెన్నాయుడుతో వ్యంగ్యంగా సీఎం జగన్ మాట్లాడారని ఆగ్రహించారు.

తాజాగా కుప్పం ఎన్నికలు పూర్తయిన తర్వాత మా డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ బీఏసీ మీటింగ్‌కి వెళితే ‘ మీనాయకుడిని చూడాలనుంది. రమ్మనండి’ అని సాక్షాత్తూ జ‌గ‌న్‌ వ్యంగ్యంగా మాట్లాడినా భరించాం. అన్నిటిని భరించి అసెంబ్లీ సమావేశాలకు వెళితే చివరకు నా భార్యను కూడా ఇలాంటి ఈ డర్టీ పాలిటిక్సలోకి లాగారని బాధ ప‌డ్డారు. రాజకీయాల్లో నన్ను ప్రోత్సహించడం తప్ప. ఆమె ఎప్పుడూ రాజకీయాల్లోకి రావాలనుకోలేదు.

Chandrababu Naidu cries at press meet; vows to step into Assembly again  only after returning to power - Oneindia News

నేను 8 సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేశా.. 38 ఏళ్లుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నాను, ఎప్పుడూ ప్రతిపక్ష నాయకులను చులకనగా మాట్లాడలేదు. రాజకీయం అంటే ప్రజల కోసం చేసేదని నమ్మాను. ఓటములు ఎదురైనా సానుకూలంగా తీసుకుని ముందుకెళ్లాను అని.. నిండు కౌరవసభలో ఆనాడు ద్రౌపదికి అవమానం జరిగింది.

ఈ ప్రభుత్వం ప్రజల పాలిట భస్మాసుర హస్తంగా మారిందని.. ఇది కౌరవ సభ.. గౌరవం లేని సభ గతంలో వైఎస్‌ కూడా అసెంబ్లీలో నా తల్లిని అవమానించారు. ఆనాడు వైఎస్‌ తప్పు ఒప్పుకొని నాకు క్షమాపణ చెప్పారు. ఇవాళ్టి ఘటనలను ఏవిధంగా అభివర్ణించాలో అర్థం కాలేదు.  రాష్ట్ర ప్రయోజనాలే లక్యంగా రాజకీయాలు చేశాను’ అని చంద్రబాబు అన్నారు.

జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద నేతలతో పని చేశామని.. ప్రజల కోసం రాజకీయం చేస్తున్నామని గర్వంగా ఫీలయ్యేవాళ్లమని తెలిపారు. .

Related posts