telugu navyamedia
సినిమా వార్తలు

ఆర్ ఆర్ ఆర్ మూవీపై నెటిజ‌న్ కామెంట్స్‌..

ప‌వ‌ర్‌స్టార్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్ (రణం రౌద్రం రుధిరం). ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. తారక్‌ కొమురంభీమ్‌గా కనిపించనున్నారు. చెర్రీకి జోడీగా ఆలియాభట్‌ .. ఎన్టీఆర్‌కు జంటగా ఒలీవియా మోరీస్‌ నటిస్తున్నారు.

RRR Movie : ఓరీ మీ దుంపలు తెగ.. మీరెక్కడ దొరికారు రా.. అంటూ ఆర్ఆర్ఆర్ టీమ్ స్ట్రాంగ్ రిప్లై..! - India Daily Live

ఈ సినిమా రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా విడుదల తేదీ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల కానుంది.

సుమారు మూడేళ్ల క్రితం 2018 నవంబరు 18న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూట్‌ ప్రారంభమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అప్పట్లో చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఓ ఫొటో షేర్‌ చేసింది. ఇప్పుడు ఆ ఫొటోను రీట్వీట్‌ చేసిన ఓ నెటిజన్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌పై వ్యంగ్యంగా స్పందించాడు.

Vijayendra Prasad addresses RRR controversies, says SS Rajamouli film  'cannot be compared to Baahubali' | Entertainment News,The Indian Express

“డిప్లొమాలో ఉన్నప్పుడు మీరు సినిమా షూట్‌ ప్రారంభించారు. నా బీటెక్‌ కూడా అయిపోతుంది. మూవీ మాత్రం ఇంకా రిలీజ్‌ కాలేదు” అని ఒక నెటిజన్‌ ట్వీట్‌ చేయగా.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ఒకే ఒక్క మాటతో సమాధానమిచ్చేసింది. “ఏం చేద్దాం మరి.. నువ్వు కాలేజీకి వెళ్లనన్ని రోజులు మేము షూటింగ్ కూడా చేయ‌లేదు అంటూ రిఫ్లై ఇచ్చారు.

Related posts