telugu navyamedia
సినిమా వార్తలు

చిరంజీవి లాంటి వ్యక్తులకు చెప్పండి ప్రాధేయ పడవద్దని … !

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన అన్న అయినా మెగా స్టార్ట్ చిరంజీవిని సున్నితంగా హెచ్చరించాడు . శనివారం రోజు హైదరాబాద్ లో”రిపబ్లిక్ ” సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమంలో పవన్ ముఖ్య అతిధిగా పాల్గొన్నాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సినిమా థియేటర్ టికెట్ లను ఇక నుంచి ఆన్ లైన్ విధానంలోనే విక్రవిస్తామని, దీనిని ప్రభుత్వమే నిర్వహిస్తుందని ప్రకటించారు .

దీనిపై మెగాస్టార్ చిరంజీవి “లవ్ స్టోరీ ” సినిమా విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ .. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కనికరించాలని , సినిమా రంగం తీవ్ర సంక్షోభంలో వుంది ” అన్నారు . దీని పై పవన్ స్పందించారు ” చిరంజీవి లాంటి. వ్యక్తులకు చెప్పండి ప్రాధేయ పడవద్దని , ఇది మన హక్కు.. ప్రాధేయపడితే ఎవరూ ఇవ్వరు, గుర్తు పెట్టుకోండి ఇది మన హక్కు..ఇది ఒకడి సొత్తు కాదు . సినిమా రంగ పెద్దలు కూడా మౌనంగా ఉండవద్దు , మాట్లాడండి.. మీరు తప్పు చెయ్యడం లేదు .

Pawan Kalyan Brings Down Industry's Hopes Crashing With One Speech!

ప్రభుత్వానికి పన్నులు కడుతున్నాము . ధైర్యంగా మాట్లాడండి.. సినిమా తీసేవాళ్ళు మాత్రమే మాట్లాడండి. భయపడతారెందుకు , ఆలోచిస్తారెందుకు, సున్నితంగా ఉంటారేంది ? మీకు ధైర్యం లేకపోతే ఎట్లా ?” అంటూ పవన్ సినిమా రంగ ప్రముఖులకు మెత్తగా చివాట్లు పెట్టారు. 

Related posts