శృంగార తార సన్నీలియోన్ మరోసారి గూగుల్ మోస్ట్ సెర్చ్‌డ్ సెలబ్రిటీల జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. అత్యధికంగా గూగుల్‌లో వెతికిన సెలబ్రిటీల్లో సన్నీలియోన్ అగ్రస్థానంలో నిలిచారు. ఐటమ్ సాంగ్‌లతో, కైపెక్కించే చూపులతో ఈ బ్యూటీ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన మధురానుభూతులను షేర్ చేసుకుంటున్న ఈ బ్యూటీ.. తాజాగా, ఇన్‌స్టాగ్రామ్‌లో 2.5 కోట్ల మంది ఫాలోయర్లను సంపాదించుకుంది. ఈ సందర్భంగా.. ‘ఇప్పుడు నా ఇన్‌స్టా కుటుంబం 2.5 కోట్ల మందికి చేరుకుంది. ఇంకా బలపడుతోంది” అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఈ విషయాన్ని స్పష్టం చేస్తూనే.. అభిమానులకు ముద్దులు ఇచ్చింది. ఇంత ప్రేమను అందిస్తున్న ఫాలోయర్లకు తాను కృతజ్ఞురాలినై ఉంటానని తెలిపింది. కాగా, సన్నీ ప్రస్తుతం హారర్ కామెడీ చిత్రం కోకా కోలా కోసం శ్రమిస్తోంది. మలయాళంలో రానున్న రంగీలా, తమిళం, తెలుగులో రానున్న “వీరమహాదేవి”లోనూ అలరించనుంది.
previous post
next post