telugu navyamedia
సినిమా వార్తలు

నోరుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు..

ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న మా ఎన్నికల పూర్తి ఫలితాలు వ‌చ్చేసాయి. ఎన్నికల అధికారి మా ఎన్నికల పూర్తి ఫలితాలను ప్రకటించారు. పాతికేళ్ల చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది.

మా అధ్యక్ష ఎన్నికల ఫ‌లితాలు అనంత‌రం మోహన్‌బాబు. సంచలన వ్యాఖ్యలు చేశారు .తనను రెచ్చగొట్టాలని చూస్తున్నారని, కానీ సంయమనం పాటిస్తున్నానని అన్నారు. సమయం వచ్చినప్పుడు అన్నింటికి సమాధానం చెబుతానని, తాను అసమర్థుడిని కాదని చెప్పారు. సింహం నాలుగు అడుగులు వెనక్కు వెస్తే భయపడినట్లు కాదని.. అది గురి చూసి పంజా విసురుతుందని అన్నారు. మాలో ఏం జరుగుతుందో అందరు గమనిస్తున్నారని అన్నారు.

నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని హెచ్చరించారు. ఓటు ఎటు వేసినా ఇది అందరి ఓటు అని.. ఇది అందరి విజయమని మోహన్ బాబు స్పష్టం చేశారు. పలువురిపై పరోక్షంగా విమర్శలు చేశారు. ముఖ్యమంత్రుల సహకారం లేకుండా ఏమీ చేయలేం’ అని అన్నారు.

Related posts