telugu navyamedia
సినిమా వార్తలు

హేమపై ఫైర్ అయిన రాహుల్ సింప్లిగంజ్…

Bigg-Boss-3

బిగ్ బాస్ హౌజ్ లో రెండవ రోజు నుంచే రచ్చ మొదలైంది. రెండవ రోజు శ్రీముఖి, రోహిణికి మధ్య జరిగిన గొడవలో రోహిణి ఎమోషనల్ అయి ఏడ్చేసింది. నామినేష‌న్ టైం వచ్చే స‌రికి ఒరిజిన‌ల్ రూపాలు బ‌య‌ట‌కి వ‌స్తున్నాయి. రెండో రోజు హేమ‌, శ్రీముఖి, హిమ‌జ మ‌ధ్య చిన్న‌పాటి యుద్ధ‌మే జ‌ర‌గ‌గా, మూడో రోజు హేమ‌, రాహుల్ సిప్లిగంజ్ మ‌ధ్య వార్ జ‌రిగింది. మూడో రోజు బిగ్ బాస్.. ఇంటి స‌భ్యుల‌ని బాల్యంలోకి తీసుకెళ్ళాడు. అంద‌రు చిన్న పిల్ల‌ల్లా మారాల‌ని వారికి కేర్ టేక‌ర్‌గా వ‌రుణ్ సందేశ్‌, పున‌ర్న‌వి ఉంటార‌ని చెప్పారు. టాస్క్ మొద‌లు కాగానే ఇంటి స‌భ్యులు అంద‌రు చిన్న పిల్ల‌ల్లా డ్రెస్ ధ‌రించి ముఖానికి లిప్‌స్టిక్‌లు పూసుకొని రెచ్చిపోయారు. ఒకానొక ద‌శ‌లో వీరి ర‌చ్చ ప్రేక్ష‌కుల‌కి కాస్త అస‌హ‌నం కూడా క‌లిగించింది. అయితే ఇంటి స‌భ్యుల‌లో ఒక‌డైన మ‌హేష్ విట్టా త‌న‌కి ఓవ‌రాక్ష‌న్ చేయ‌డం రాద‌ని, చిన్న‌ప్పుడు సైలెంట్‌గానే ఉన్నాన‌ని చెప్పి మంచం ఎక్కి ప‌డుకున్నాడు. దీంతో ర‌వికృష్ణ‌, రోహిణిలు మ‌హేష్‌ని ఉద్దేశించి “క‌ర్రోడు… ఓ పొడుస్తా” అన్నాడు. ఇప్పుడేమో మంచం ఎక్కి కూర్చున్నాడంటూ కుళ్ళు జోకులు వేసుకున్నారు. ఇది విన్న మ‌హేష్ వారిపై సీరియ‌స్ అయ్యాడు. “నువ్ అసలు చదువుకున్నావా? మహేష్ గాడు అను పర్లేదు.. అంతే కాని కర్రోడు అంటూ కించపరిచేలా మాట్లాడితే బాగోదు” అని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో రవిక్రిష్ణ, రోహిణి… మహేష్ విట్టాకు సారీ చెప్పాడు.

కొద్ది సేప‌టి తర్వాత శ్రీముఖి ఫుడ్ విష‌యంపై రాహుల్‌తో పాటు ప‌లువురు ఇంటి స‌భ్యుల‌తో క‌లిసి చ‌ర్చ జ‌రుపుతుంది. ఇంత‌లో అక్క‌డికి వ‌చ్చిన హేమ నువ్వు వారిని ఫుడ్ గురించి ఎందుకు అడిగావు అంటూ శ్రీముఖిని ప్ర‌శ్నించింది. దీంతో ప‌క్క‌న ఉన్న రాహుల్ సిప్లిగంజ్‌, అలీరాజా ఫైర్ అయ్యారు. అంటే మేము అడ‌గ‌కూడ‌దా, పిచ్చోళ్ళ‌లెక్క క‌నిపిస్తున్నామా అంటూ రాహుల్‌.. హేమపై ఫైర్ అయ్యాడు. కొద్ది సేపు ప్ర‌శాంతంగా ఉన్న హేమ‌.. రాహుల్‌పై రివ‌ర్స్ ఫైర్ అయింది. ఇక అక్క‌డ వాతావ‌ర‌ణం హీటెక్కుతుంద‌ని భావించిన మిగ‌తా ఇంటి స‌భ్యులు గార్డెన్ ఏరియాకు తీసుకెళ్లి స‌ర్ధి చెప్ప‌డంతో వివాదం కాస్త స‌ద్దుమ‌ణిగింది. ఇక నేటి ఎపిసోడ్‌కి సంబంధించి ప్రోమో విడుద‌ల కాగా, ఇందులో చ‌పాతి ముక్క కోసం హౌజ్‌మేట్స్ మ‌ధ్య వార్ న‌డిచింది. చిన్న చపాతి ముక్క కోసం రచ్చనా? చాలా సిల్లీగా ఉందంటోంది పునర్నవి భూపాలం చెప్పుకొచ్చింది. రానున్న రోజుల్లో బిగ్ బాస్ హౌజ్ రచ్చ‌తో ఎంత హీటెక్కుతుందో.

Related posts