రానా, సాయిపల్లవి జంటగా తెరకెక్కుతున్న తాజా చిత్రం “విరాటపర్వం 1992”. “నీది నాది ఒకే కథ” ఫేం వేణు ఊడుగుల చిత్రానికి దర్శత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రముఖ నటి టబు కీలక పాత్రలో నటిస్తోంది. ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 1990ల నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా ఈ మూవీని వేణు తెరకెక్కించనున్నాడు. పీరియాడిక్ సోషల్ డ్రామాగా రూపొందనుంది. వైజాగ్‌కి చెందిన అలనాటి బాలీవుడ్ నటి జరీనా వాహబ్ కూడా చిత్రంలో ముఖ్య పాత్ర పోషించనున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ నటుడు నానా పటేకర్ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడట. అలానే టబు పాత్ర కూడా కాస్త నెగెటివ్ షేడ్ లో ఉంటుందట. ఈ సినిమాలో రానా పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో తన పాత్ర కోసం రానా రిటైర్డ్ పోలీస్ ఉన్నతాధికారి దగ్గర ప్రత్యేకంగా శిక్షణ తీసుకోనున్నాడట. జనవరి మొదటివారంలో రానా తన శిక్షణను షురూ చేస్తాడని టాక్. రైఫిల్ షూటింగ్, ఆత్మరక్షణ మెలకువలు, ఇతర అంశాల్లో రానా శిక్షణ తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
previous post