telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“డిస్కోరాజా”లో అల్లరి నరేశ్… క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

Disco

మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం “డిస్కోరాజా”. వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో నభానటేశ్‌, పాయల్‌రాజ్‌పుత్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఎస్‌ థమన్‌ మ్యూజిక్‌డైరెక్టర్‌. వెన్నెల కిశోర్‌, సత్య, అజయ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాబీ సింహా విలన్‌. ఈ సినిమాలో అల్లరినరేశ్‌ కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ చిత్రం సెకండ్‌ హాఫ్‌లో కీలకంగా ఉండే పాత్రలో అల్లరి నరేశ్‌ కనిపిస్తాడని టాక్‌ వినిపించింది. అయితే ఈ వార్తలపై డైరెక్టర్‌ వీఐ ఆనంద్‌ క్లారిటీ ఇచ్చాడు. “డిస్కోరాజా”లో అల్లరి నరేశ్‌ నటించడం లేదు. అల్లరి నరేశ్‌ నటిస్తున్నట్లు వచ్చిన వార్లలు పూర్తిగా అవాస్తవమన్నారు.

Related posts