telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్ : ఒకే బెడ్ పై… ముద్దులు రొమాన్స్ కూడా…!?

huge security at salman khan house

సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్ బాస్ 13వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఇప్పుడు ముద్దులతో తెగ రొమాన్స్‌లు చేసుకుంటున్నారు. ఈ షోలో పాల్గొన్న బుల్లి తెర నటులు మధురిమా తులి, విశాల్ ఆదిత్య సింగ్ ఒకప్పుడు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత గొడవలు వచ్చి విడిపోయారు. హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా పాత గొడవలు మర్చిపోలేక ఇద్దరూ వారం రోజుల పాటు మాట్లాడుకోలేదు. పైగా అసహ్యంగా అందరి ముందు తిట్టుకున్నారు కూడా. ఇప్పుడు సీన్ మారింది. ఇద్దరి మధ్య ఉన్నట్టుండి ప్రేమ పుట్టుకొచ్చింది. ఎంత కొట్టుకున్నా ఇద్దరూ ఒకప్పుడు ప్రేమించుకున్నారు కాబట్టి ఇద్దరూ దగ్గరైపోయారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ వీరిద్దరి తతంగం ఒకే బెడ్‌పై నిద్రపోయే వరకూ వచ్చింది. అంతేకాదు దుప్పట్లో దూరి మరీ ముద్దులు పెట్టుకుంటూ తెగ రొమాన్స్‌లు చేసుకుంటూ బిగ్ బాస్ కెమెరాలకు చిక్కారు. రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఇదే విధంగా తనను సపోర్ట్ చేసి ఉంటే ఇలా విడిపోయేవాళ్లం కాదు కదా అంటూ తెగ కబుర్లు చెప్పుకున్నారు. అయితే విశాల్, మధురిమ ప్రేమించి విడిపోయారని తెలుసుకున్న బిగ్ బాస్ నిర్వాహకులు వారిని కావాలనే హౌజ్‌లోకి పంపించారట. విడిపోయిన ప్రేమికుల మధ్య జరిగే సంఘటనలు ఆసక్తికరంగా ఉంటాయని మధురిమకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇప్పించారు. అంతేకాదు షో కోసం ఇద్దరూ కలిసిపోవాలని చెప్పారట. అయితే బిగ్ బాస్ షోని లవర్స్ పార్క్‌లా మార్చేస్తున్నారని కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related posts