telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఆదిపురుష్”లో కియారా ?

Kiara

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ (తానాజీ ఫేమ్) దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే భారీ చిత్రం తెరకెక్క‌నున్న‌ట్టు ప్రకటించారు. ‘చెడు మీద మంచి సాధించిన విజయం’ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రం రామాయణం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారని, ప్రభాస్ రాముడి పాత్రను పోషిస్తాడని తెలుస్తోంది. ‘ఆదిపురుష్’ సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణానికి టీ సిరిస్ సంస్థ ఏకంగా రూ 1000 కోట్లు వెచ్చించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. కాగా ఈ చిత్రంలో సీత పాత్రకోసం కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా కీర్తి సురేష్ స్థానంలో బాలీవుడ్ భామ కీయరా అద్వానీ పేరు వినిపిస్తోంది. బాలీవుడ్ లో కీయరా టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది.

Related posts