telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

విరాట పర్వం టీజర్ విడుదల చేయనున్న చిరు…

రానా దగ్గుపాటి ప్రస్తుతం విరాటపర్వం అనే సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రానాకు జంటగా సాయి పల్లవి చేస్తుంది. ఈ సినిమా ”నీదీ నాదీ ఒకే కథ” ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇందోలో నటి ప్రియమణి కీలక పాత్ర పోషించనున్నారు. ఇక ఈ సినిమా 1990నాటి నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కతోంది. ఈ సినిమాలో నక్సల్ నాయకుడు రవి అన్న పాత్రలో రానా కనిపించనున్నాడు. ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు సమర్పణలో ఎస్ ఎల్ వీ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా టీజర్ ను బిడుదల చేయనున్నారు. రేపు సాయంత్రం 5:04 గంటలకు విరాటపర్వం టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేయనున్నాడు. అయితే ఇంతకముందు ఇందులో నుండి వచ్చిన ‘కోలు కోలు’ పాట ప్రజలను ఆకట్టుకుంటుంది. దాంతో ఈ సినిమాపై అభిమానులు అంచనాలు బాగానే పెట్టుకున్నారు

Related posts