telugu navyamedia
సినిమా వార్తలు

వై .సి .పి నాయకులను మూసుకొని కూర్చోమని చెప్పలేరా ?

” ఈ మధ్యన ఓ సన్నాసి .. అతని పేరేమిటో మర్చిపోయాను . మానాయకుడు చిరంజీవి గారంటే సోదర భావం ఉందని చెప్పాడు . అక్కరకు రాని సోదరభావం దిబ్బలో వెయ్యడానికా ? సినిమా పరిశ్రమ మీద దాదాపు లక్షమంది ఆధారపడ్డారు , అలాగే థియేటర్ ల మీద కొన్ని వేల కుటుంబాలు జీవిస్తున్నాయి . నా మీద కోపంతో ఇంత మంది పొట్ట కొట్టడం అన్యాయం కదా ?” అంటూ వై .సి .పి మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మండిపడ్డాడు.

ఇడుపులపాయ నేల మాలిగలో లక్ష కోట్ల సంపద.. వైఎస్ వివేకా హత్య ఎలా జరిగింది.. ఏపీ సర్కార్‌పై పవన్ ధ్వజం | Pawan Kalyan serious allegations on YS Jagan's YSRCP Government in ...

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన “రిపబ్లిక్ ” సినిమా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నాడు . ఆయన ఉపన్యాసంలో మొత్తం వై .సి .పి . ప్రభుత్వాన్ని , నాయకులను దుమ్మెత్తి పోశారు . ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో సినిమా థియేటర్ల సమస్యలపై చర్చించడానికి సమాచారమంత్రి పేర్ని నాని, కమీషనర్ విజయకుమార్ రెడ్డి తో నిర్మాతలు , దర్శకులు విజయవాడ లో సమావేశమయ్యారు. హైదరాబాద్ నుంచి 60 మంది సినిమా రంగ ప్రముఖులు విజయవాడ వెళ్లారు . నాని , విజయకుమార్‌ రెడ్డి ఈ ఇద్ద‌రితో నిర్మాతలు , దర్శకులు థియేటర్ లలో టిక్కెట్లు ఆన్ లైన్ విధానంపై చెప్పిన సమస్యలను విని . వీటిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెడతామని చెప్పారు . హైదరాబాద్ నుంచి వెళ్లిన వారందరికీ విందు భోజనం పెట్టి పంపించారట .ప్రకాశ్ రాజ్‌తో అభిప్రాయ బేధాలు ఉన్నాయంటూ

దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ .. – ” ప్రభుత్వాన్ని చూసి ఎందుకు భయపడాలి. అలా భయపడేవారంటే నాకు చిరాకు. అందరూ పెద్దవాళ్ళే , వైకాపా . నాయకులను మూసుకొని కూర్చోమని ఎందుకు చెప్పలేరు. అలా చెబితే ఏమి చేస్తారు ? ఇది వై .సి .పి రిపబ్లిక్ కాదు , భారత రిపబ్లిక్ అని చెప్పండి ” అని మండిపడ్డారు .
” అధికారంలోకి వచ్చినవారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి . అధికారం వుంది కదా అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే లిబియా అధ్యక్షుడు గడాఫీకి ఏ గతి పట్టిందో తెలుసుకోండి ” అన్నారు .

Related posts