telugu navyamedia
రాశి ఫలాలు

సెప్టెంబర్ 26, ఆదివారం రాశి ఫలాలు..

మేషం
పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆప్తులతో కలహాలు. అనారోగ్య సూచనలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి.  ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి ఒత్తిడి, చికాకులు పెరుగుతాయి.

వృషభం
యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. స్త్రీలకు తల, నరాలు, కాళ్లకు సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు.

మిథునం
వ్యయప్రయాసలతో పనులు పూర్తి. బంధువులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి ఆశాజనకం. పెద్దల ఆరోగ్యంలో మెళకువ వహించండి.

కర్కాటకం
సన్నిహితులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు.  మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది.మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది.

సింహం
పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులు తారసపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. మిమ్మలను చూసి అసూయపడేవారు అధికమవుతారు. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది

కన్య
దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కుటుంబంలో కలతలు, చికాకులు నిదానంగా సర్దుకుంటాయి.

తుల
వ్యవహారాలు నిదానిస్తాయి. శ్రమాధిక్యం. బంధుమిత్రులతో విరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.ఉపాధ్యాయులకు కార్యక్రమాలలో ఒత్తిడి అధికమవుతుంది. దంపతుల మధ్య సఖ్యతా లోపం. పట్టింపులు చోటు చేసుకుంటాయి.

వృశ్చికం
కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ ఊహలు నిజం చేసుకుంటారు.వృత్తి వ్యాపారాల్లో శారీరకంగా, మానసికంగా శ్రమిస్తారు. విదేశీయాన వ్యవహారాలు అనుకూలిస్తాయి. 

ధనుస్సు
బాకీలు వసూలవుతాయి. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యజయం. ఆస్తిలాభం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. సోదరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. బ్యాంకింగ్ వ్యవహారాలు, మధ్యవర్తిత్వాలకు సంబంధించిన విషయాల్లో ఏకాగ్రత ముఖ్యం.

మకరం
వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. ప్రయాణాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. సంతానపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు మేలు చేకూరుస్తారు. 

కుంభం
ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. అనారోగ్య సూచనలు. బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.  మీ కుటుంబ విషయంలో ఇతరుల జోక్యం మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.  

మీనం
కొత్త విషయాలు గ్రహిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. నేర్పుగా సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. ఉద్యోగయోగం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారు అచ్చుతప్పులు పడుట వల్ల మాటపడక తప్పదు. దైనందిన జీవితంలో స్వల్ప మార్పులు జరుగుతాయి. 

Related posts