telugu navyamedia
సినిమా వార్తలు

పవర్ లేనివాడికి పవర్ స్టార్ ఏమిటి ?

“రిపబ్లిక్ ” సినిమా అక్టోబర్ 1న విడుదల కాబోతుంది . ఈ సందర్భగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా జనసేన అధ్యక్షుడు , హీరో పవన్ కళ్యాణ్ ఆడిటోరియంలోకి వస్తున్నప్పుడు యాంకర్ సుమ ” పవర్ స్టార్ , పవర్ స్టార్ వచ్చేస్తున్నారు ” అని ప్రకటించారు .సభలో వున్న సాయి ధర్మ తేజ్ , పవన్ కళ్యాణ్ అభిమానులు ” పవర్ స్టార్ , పవర్ స్టార్ , సి .ఎం , సి .ఎం ” అంటూ కేరింతలు కొడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఆ సన్నాసి మంత్రికి చెప్పండి.. అక్కడ కొట్టుకొనేందుకుకా? రిపబ్లిక్ వేడుకలో పవన్ కల్యాణ్ ఆగ్రహం | Pawan Kalyan power speech on YS Jagan government at Republic movie pre release ...

పవన్ కళ్యాణ్ మాట్లాడేటప్పుడు కూడా ” పవర్ స్టార్ , పవర్ స్టార్ , సి .ఎం , సి .ఎం ” నినాదాలు ఆగలేదు . పవన్ మాటాడటం ఆపి అభిమానుల వైపు చూసి “పవర్ లేనోడికి పవర్ స్టార్ ఏమిటి ? నేను సి .ఎం లాంటి నినాదాల కోసం రాలేదు . తేజ్ ఈ కార్యక్రమానికి వచ్చే పరిస్థితుల్లో లేడు . ఆసుపత్రి బెడ్ మీద వున్నాడు , అందుకే అతని సినిమా థియేటర్ లలో బాగా ఆడాలనే ఉద్దేశ్యంతో ఇక్కడికి వచ్చాను ” అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశాడు .

Related posts