telugu navyamedia
రాశి ఫలాలు

న‌వంబ‌ర్ 10, బుధ‌వారం రాశిఫ‌లాలు..

మేష రాశి..

ఉద్యోగస్తులు తరుచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. విద్యార్థుల్లో ధ్యేయం పట్ల ఏకాగ్రత, స్థిరబుద్ధి నెలకొంటాయి. సమస్యలు ఎదురైనప్పటికీ.. కృషి, పట్టుదలతో అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఒక సమస్య పరిష్కారమవుతుంది. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. దైవదర్శనాలు చేస్తారు.

వృషభ రాశి..

నిరుద్యోగులకు ఆశాజనకం. అనారోగ్యం భారీన ప‌డ‌తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు ఎదుర‌వుతాయి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిలిపివేసిన పనులు పును ప్రారంభిస్తారు.అవసరానికి బంధుమిత్రుల నుంచి సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త వింటారు.

మిథున రాశి..

వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం అవుతాయి. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఏర్ప‌డ‌తాయి.

కర్కాటక రాశి..

మీ మంచి కోరుకొనేవారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారు. అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రారంభించిన పనులను పట్టుదలతో ప్రణాళికాబద్దంగా పూర్తిచేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి సహాయం ల‌భిస్తుంది.

సింహరాశి..

ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. చేపట్టిన పనులను సకాలంలో పూర్తిచేయగలుగుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు వాహనయోగం క‌లుగుతుంది. స్థిరాస్తి వివాదాలు తీరతాయి.

కన్య రాశి..

సిమెంటు, కలప, ఇటుక, వ్యాపారులకు ఆశాజనకంగా ఉండగలదు. బంధువులను కలుసుకుంటారు. ​చేపట్టిన పనుల్లో శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించడం మంచిది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సన్నిహితులతో కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు.

తులరాశి..

చేపట్టబోయే పనుల్లో శ్రమ పెరుగుతుంది. విద్యార్థుల్లో ఏకాగ్రత, స్థిరబుద్ది నెలకొంటాయి. విలువై వస్తువుల పట్ల అప్రమత్తత అవసరం. ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో ముందుకుసాగాలి. బంధుమిత్రుల నుంచి సహాయసహకారాలు అందుతాయి.వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం ఏర్ప‌డుతుంది.

వృశ్చిక రాశి..

ముఖ్యుల పట్ల ఆహంకారం వ్యక్తం చేయటం వల్ల అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. బ్యాంకింగ్ రంగాలవారు అధిక ఒత్తిడిని శ్రమను ఎదుర్కొంటారు. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనుల్లో ఇబ్బందులు ఎదురైనా సకాలంలో పూర్తిచేస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి.

ధనుస్సు రాశి..

ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు సవాలుగా నిలుస్తాయి. నిరుద్యోగులు వచ్చిన తాత్కాలిక అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం మంచిది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ.. వాటిని అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తారు. మనోధైర్యంతో ముందడుగే వస్తే విజయం చేకూరే అవకాశముంది.

మకర రాశి..

సన్నిహితుల నుంచి ధనలాభం. వాహనయోగం క‌లుగుతుంది. వ్యాపారాలలో మరింత అభివృద్ధి పెరుగుతుంది. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. ఈ రోజు ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కీలక వ్యవహారాల్లో పెద్దల సూచనలు తీసుకోవడం మంచిది. గొడవలకు దూరంగా ఉండాలి.

కుంభ రాశి..

మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు యాజమాన్యం ధోరణి నిరుత్సాహపరుస్తుంది. అనుకునే కార్య‌క్ర‌మాల‌కు మిశ్రమ ఫ‌లితాలు ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

మీన రాశి..

నిరుద్యోగుల యత్నాలు కలిసిరాగలవు. చేపట్టినపనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా సంతృప్తికరంగా పూర్తి కాగలవు. శుభఫలితాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. గొడవలకు దూరంగా ఉండాలి. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది.

Related posts