telugu navyamedia
రాశి ఫలాలు

డిసెంబర్‌ 18, శనివారం రాశిఫలాలు…

మేషరాశి

రాజకీయ రంగాలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఎంత క‌ష్ట ప‌డినా ఫలితం కనిపించదు. విద్యార్థులకు అవకాశాలు నిరాశ కలిగిస్తాయి. బంధువర్గం నుంచి ఒత్తిడులు ఏర్ప‌డ‌తాయి. వ‌చ్చే రాబడి కొంత తగ్గుతుంది. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వ్యాపారాలలో ఒడిదుడుకులు ఏర్ప‌డ‌తాయి. ఉద్యోగులకు కొద్దిగా చికాకులు నెల‌కొంటాయి.

వృషభరాశి..

బంధు మిత్రులతో స‌ర‌ద‌గా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు సంతప్తికరంగా ఉంటాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదుర‌వుతాయి. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగాల్లో బాగుంటుంది. మనోధైర్యంతో ఇబ్బందులు తొలుగుతాయి.

మిథునరాశి..

ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. కుటుంబంలో అనుకోని చికాకులు క‌లుగుతాయి. దూరప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన ఏర్ప‌డుతుంది. స్నేహితులు శత్రువులుగా మారతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు ఆలస్యం అవుతాయి. ఉద్యోగులకు ఇబ్బందులు ఎదుర‌వుతాయి.

కర్కాటకరాశి..

ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. ఆదాయం పెరుగుతోంది. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. మీ తెలివితేట‌ల‌తో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగాల్లో ఉన్నతస్థితికి వెళ‌తారు. దైవ ద‌ర్శ‌నాలు చేస్తారు. విందువినోదాల్లో పాల్గొంటారు.

సింహరాశి..

స్నేహితులతో స‌ర‌దాగా గడుపుతారు. దైవ‌ కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. స్త్రీలు విలువైన వస్తువులు చేజార్చుకునే ఆస్కారం ఉంది. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పై అధికారులు నుంచి మంచి గుర్తింపు ల‌భిస్తుంది.

కన్యరాశి..

రుణయత్నాలు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర‌వుతాయి. ఉద్యోగస్తుల ప్రతిభ, పనితనానికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సివస్తుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు స్నేహితులతో విభేదాలు ఏర్ప‌డ‌తాయి. ఆరోగ్యభంగం కలుగుతుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు వేరే చోటికి బ‌దీలు జ‌రుగుతాయి

తులరాశి..

భాగస్వాముల మధ్య కొత్త కొత్త విషయాలు చర్చకు వస్తాయి. కొన్ని ముఖ్య‌మైన‌ ప్రయాణాలు వాయిదా. బంధువులతో విభేదాలు ఏర్ప‌డ‌తాయి. రాబడి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు మొద‌ల‌వుతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు ఎదుర‌వుతాయి. తోటివారితో కలిసి తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి.

వృశ్చికరాశి..

విద్యార్ధులు చ‌ద‌వుల్లో విజయం సాధిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఎప్ప‌టినుంచో అనుకున్న జీవితాశయం నెరవేరుతుంది. వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఉద్యోగులకు ప‌ని ఒత్తిడి త‌గ్గి ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణం క‌లుగుతుంది.

ధనుస్సురాశి..

నూతన ఉద్యోగాల్లో చేరతారు. పత్రికా రంగంలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమ‌వుతుంది. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు జాగ్ర‌త్త పాటించ‌డం మంచిది. కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. ఆకస్మిక ధనలాభం వ‌చ్చే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. వ్యాపారాలు బ్రాంచ్‌లు పెడ‌తారు. ఉద్యోగులకు ప‌నిచేసే చోట‌ చికాకులు తొలగుతాయి.

మకరరాశి..

విందులు, దైవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. దూరప్రయాణాలు ఉంటాయి. బంధుల‌తో మాటపట్టింపులు క‌లుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని కార్యక్రమాలు వాయిదా ప‌డ‌తాయి. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు ఎదుర‌వుతాయి.

కుంభరాశి..

ముఖ్య కార్యక్రమాలలో అవరోధాలు ఏర్ప‌డ‌తాయి. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. రాబడికి మించి ఖర్చులు అవుతాయి. బాధ్యతలతో సతమతమవుతారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వ్యాపారులు పెట్టుబడుల్లో తొందరవద్దు పెద్ద‌లు స‌ల‌హాలు పాటిస్తే మంచిది. ఉద్యోగాల్లో చికాకులు ఎదుర‌వుతాయి.

మీనరాశి..

వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. గత కొంత కాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి.సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. బంధుమిత్రులను కలుపుకొనిపోతారు. బంధువుల నుంచి కీలక సమాచారం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాల్లో ఉన్నత స్థితికి ఎదుగుతారు.

Related posts