telugu navyamedia
రాశి ఫలాలు

న‌వంబ‌ర్ 19, శుక్ర‌వారం రాశిఫ‌లాలు…

మేష రాశి..

కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు ఏర్ప‌డ‌తాయి. వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. చేపట్టిన పనుల్లో వ్యతిరేక ఫలితాలు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. కొత్త పనులను వాయిదా వేసుకుంటే మంచిది. దైవదర్శనాలు చేస్తారు.

వృషభ రాశి..

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఆర్ధికంగా బలపడతారు. శుభవార్త వింటారు. కుటుంబంలో సంతోషం వెల్లువిరుస్తుంది. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీలు సంతోషంగా గడుపుతారు.సోదరుల కలయిక ఏర్ప‌డ‌తాయి.

మిధున రాశి..

విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. వ్యాపారవృద్ధి అవుతుంది. వృధా ప్రయాణాలు చేస్తారు. మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాల్సి ఉంచడం మంచిది. శారీరకంగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ధన వ్యయం చేస్తారు. కుటుంబంలో ఇబ్బందులు ఏర్పడతాయి.స్థిరమైన ఆలోచనలతో మంచి ఫలితాలను అందుకుంటారు.

కర్కాటక రాశి..

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. మంచి అవకాశాలను మిస్ చేసుకుంటారు. ఆర్ధిక పరిస్థితి యధావిధిగా కొనసాగుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. పిల్లల విషయం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. వస్తులాభాలు. కొత్త కార్యక్రమాలు చేపడతారు.

సింహ రాశి..

కుటుంబసభ్యులతో వివాదాలు ఏర్ప‌డ‌తాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. రుణ ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబంలో శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. భయాందోళనలు దూరమవుతారు. ఆరోగ్యభంగం ఏర్ప‌డుతుంది.

కన్య రాశి..

వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు ఏర్ప‌డ‌తాయి. చేపట్టిన ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వృత్తి,ఉద్యోగ వ్యాపారాది రంగాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కొత్త వ్యక్తులకు దూరంగా ఉండడం మేలు చేస్తుంది. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో విరోధం కలిగే అవకాశం ఉంది.

తుల రాశి..

ఇంటర్వ్యూలు అందుతాయి. ముఖ్య‌మైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. తినే ఆహారం వలన కొంత అనారోగ్య బాధలను అనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. మనస్సు చంచలంగా ఉంటుంది. చెడు సావాసాలు దూరంగా ఉండడం మంచిది. మిశ్రమ వాతావరణం ఉంటుంది.

వృశ్చిక రాశి..

అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. కొత్త పనులు చేపడతారు. స్వల్పలాభం చేకూరుతుంది. వృత్తి, వ్యాపార రంగంలో లాభాలు పొందుతారు. అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది.

ధనస్సు రాశి..

ప్రారంభించిన పనులలో శుభ ఫలితాలను సాధిస్తారు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కొత్త వస్తువులు, నగలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులల్లో విజయం సొంతం చేసుకుంటారు. శుభవార్తలు వింటారు. కుటుంబంలో సుఖసంతోషాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధన లాభం ఉంది.

మకర రాశి..

కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు ఏర్ప‌డ‌తాయి. స్థిరమైన నిర్ణయాలను తీసుకోలేరు. బంధు మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తవహించడం మంచిది. మానసిక ఆందోళన కాలుతుంది. కొత్త పనుల కోసం ప్రణాళికలు వేస్తారు. అపకీర్తికి గురయ్యే అవకాశం ఉంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు.వృత్తి, ఉద్యోగ వ్యాపార స్థలాలలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

కుంభ రాశి..

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చేపట్టినపనుల్లో శారీరక శ్రమ అధికమవుతుంది. బంధు మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొత్తపనులు వాయిదా వేసుకోవడం మేలు చేస్తుంది. ప్రయాణాల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేసే పనుల్లో ఇబ్బందులు ఉంటాయి.కొన్ని సంఘటనలు మిమ్మల్ని కాస్త నిరుత్సాహపరుస్తాయి

మీన రాశి..

పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. ఆకస్మిక ధన నష్టం కలుగుతుంది. వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి.శుభవార్తలు వింటారు.

Related posts