telugu navyamedia
రాశి ఫలాలు

అక్టోబర్12(మంగళ వారం) రాశి ఫలాలు

మేషం: ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఉద్యోగులకు అనుకూలం. చేపట్టిన పనులు పూర్తవుతాయి. కుటుంబ సమస్య పరిష్కారం అవుతుంది. వివాదాలకు పోవద్దు. అందరితో సఖ్యతగా ఉండండి. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఎవరికీ హామీలు ఉండొద్దు.

వృషభం: ఆదాయం, ఆరోగ్యం పర్వాలేదు. వృత్తి ఉద్యోగాల వారికి పురోగతి ఉంటుంది. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండండి. కొత్త ఆదాయ మార్గాలకు అన్వేషిస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. బంధు మిత్రుల సహకారం ఉంటుంది.

మిథునం: ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వ్యాపారులకు లాభదాయకం. ఉద్యోగులకు అనుకూలం. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శుభవార్తల వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. కొన్ని పనులు వాయిదా పడే సూచనలు.

కర్కాటకం: ఆదాయం పర్వాలేదు. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. స్థిరాస్తి కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తారు. బంధు మిత్రుల సహకారం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులు తమ ప్రయత్నాల్లో ఏకాగ్రత వహించాలి.

సింహం: ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ఉద్యోగులకు అనుకూలం, అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం. కొన్ని ఆటంకాలు ఎదురైనా చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. అదనపు బాధ్యతలు ఉంటాయి, శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. విభేదాలకు పోవద్దు.

కన్య: ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులకు లాభదాయకం. చేపట్టిన పనులు పూర్తవుతాయి. పెద్దలను కలుసుకుంటారు. ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

తుల: ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు. అప్పులు తీరుస్తారు. ఖర్చులను తగ్గించుకోవాలి, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. చేపట్టిన పనులు కొంతవరకు పూర్తవుతాయి.

వృశ్చికం: ఆదాయం బాగుంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉద్యోగులు పై అధికారుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సమస్య పరిష్కారమవుతుంది. పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారులకు లాభదాయకం, శుభవార్తలు వింటారు.

ధనస్సు: ఆదాయానికి సంబంధించి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు, వృత్తి నిపుణులకు అనుకూలం.చేపట్టిన పనుల్లో కాస్త ఇబ్బందులు తప్పవు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మకరం: ఆర్థికంగా బాగుంటుంది, చేపట్టిన పనులు చాలావరకు పూర్తవుతాయి, ఉద్యోగులకు అనుకూలం, అధికారుల ప్రశంసలు అందుకుంటారు, కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. వాహనం కొనుగోలుకు ప్రయత్నిస్తారు. ప్రయాణాలు వాయిదా పడతాయి.

కుంభం: ఆదాయంతో పాటు ఖర్చులు పెరుగుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, ఉద్యోగులకు అనుకూలం, కొత్త పరిచయాలు ఏర్పడతాయి, ఓ కీలక సమస్యను పరిష్కరిస్తారు, కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి, విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వివాదాలకు పోవద్దు.

మీనం: ఆదాయం పర్వాలేదు, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి, ఉద్యోగులకు తోటివారి సహకారం అందుతుంది, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం, మీ లక్ష్యాన్ని పూర్తిచేసే దిశగా ముందుకు వెళ్తారు, వృత్తి నిపుణులకు మిశ్రమ ఫలితాలు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, బంధు మిత్రులతో అపార్థాలకు అవకాశం.

 

Related posts