telugu navyamedia
రాశి ఫలాలు

సెప్టెంబర్ 11(శనివారం) రాశి ఫలాలు

మేషం: తలపెట్టిన పనులు నేరవేరుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మక చింతన పెరుగుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆదాయం పర్వాలేదు

వృషభం: ఉద్యోగానికి, ఆదాయానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగుంటుంది. హామీలు ఉండవద్దు. కుటుబసభ్యులతో కాలక్షేపం చేస్తారు. పనులు శ్రమ మీద పూర్తి అవుతాయి.

మిథునం: ఉద్యోగులకు అనుకూలం. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. సమాజసేవ కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు.

కర్కాటకం: ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వివాహ ప్రయత్నాలకు అనుకూలం. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గించుకోండి. విందు, వినోదల్లో పాల్గొంటారు.

సింహం: వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. ఆదాయం పర్వాలేదు. ఖర్చులు పెరుగుతాయి. తలపెట్టిన పనులు అతి కష్టంమీద పూర్తవుతాయి. నిరుద్యోగులకు అనుకూలం.

కన్య: ఆదాయం నిలకడగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులు పలకరిస్తారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి.

తుల: ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు, ప్రోత్సాహం లభిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. రావాల్సిన డబ్బు అనుకోకుండా చేతికి అంది అవసరాలు తీరతాయి. పెళ్లి సంబంధం కుదరవచ్చు. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

వృశ్చికం: ఉద్యోగులకు అనుకూలం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖర్చులు తగ్గించుకోండి. స్నేహితులతో హాయిగా కాలక్షేపం చేస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు.

ధనస్సు: ఆదాయం నిలకబడగా ఉంటుంది. కొద్దిగా ఆలస్యమైనా పనులు పూర్తవుతాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త.

మకరం: ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గించుకోండి. ఉద్యోగంలో ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు ఫలిస్తాయి. హామీలు ఉండవద్దు. ఆరోగ్యం జాగ్రత్త.

కుంభం: వృత్తి, వ్యాపారులకు బాగుంటుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగ జీవితం ఆశాజనకంగా ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుని పనులు మొదలుపెట్టండి. కొన్ని కుటుంబ బాధ్యతలను సమర్థంతంగా పూర్తి చేస్తారు.

మీనం: సమయం అనుకూలం. ఆదాయం పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విందు, వినోదలతో సరదాగా గడుపుతారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో ప్రోత్సాహం లభిస్తుంది.

Related posts