మేషం : తలపెట్టిన పనులు వెంటనే పూర్తి అవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. చిన్నతరహా పరిశ్రమలలో వారికి అనుకూలంగా ఉంది.
వృషభం : ఉద్యోగంలో బాగా శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. ఓర్పుతో వ్యవహరిస్తే మంచే జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఎవరినీ పూర్తిగా నమ్మవద్దు. సొంత నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సభ్యుల సలహాలు కూడా పాటించండి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది.
మిథునం : ముఖ్యమైన పనుల్లో విజయం వరిస్తుంది. వ్యాపారంలో ఊహించని లాభాలుంటాయి. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. అదనపు బాధ్యతలు మీద పడతాయి. అవసరాలకు తగ్గట్టు డబ్బు అందుతుంది.
కర్కాటకం: ఉద్యోగపరంగా శుభ యోగం ఉంది. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. ఆర్థికంగా కోలుకుంటారు. ఇబ్బందుల్లో ఉన్న మిత్రుల్ని ఆదుకుంటారు. ఇంటా బయటా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు.
సింహం: అనుకోకుండా కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఉద్యోగంలో శ్రమ పెరిగినా ఫలితం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. వివాహ ప్రయత్నాలకు అనుకూల సమయం. ఆదాయంతో పాటు ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం పరవాలేదు.
కన్య: ఉద్యోగంలో అధికారుల నుంచి ఇబ్బందులెదురైనా ఫలితం ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడకుండా వృత్తి వ్యాపారాల్లో నిర్ణయాలు తీసుకోండి. ఆదాయం చాలావరకు నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. కొందరికి మీ ద్వారా ఆర్థికంగా మేలు జరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి.
తుల: ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు వస్తాయి. వ్యాపారంలో లాభాలుంటాయి. కొత్త నిర్ణయాలు, ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులు మంచి ఫలితం ఉంటుంది. తల పెట్టిన పనులు చాలావరకు పూర్తవుతాయి.
వృశ్చికం: మీ శ్రమ ఫలించి పనులు కొన్ని పూర్తవుతాయి. సన్నిహితులను సంప్రదిస్తే వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు గడించే అవకాశం ఉంది. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ధన లాభం ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త.
ధనస్సు: ఉత్తమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. కుటుంబ పెద్దల సహకారం ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. వాదనలకు దూరంగా ఉండండి. శ్రమ మీద కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త.
మకరం: ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. ఆర్థికంగా లాభదాయకంగా ఉంది. ఇంటా బయటా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.
కుంభం: వృత్తి వ్యాపారాల్లో శుభ ఫలితాలు వస్తాయి. ధన లాభం ఉన్నా ఖర్చులు కూడా అధికమౌతాయి. ఉద్యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. మంచి కాలం నడుస్తోంది. సద్వినియోగం చేసుకోండి. కుటుంబం ద్వారా లబ్ధి పొందుతారు.
మీనం: కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో కూడా సంప్రదించండి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా మెరుగుదల కనిపిస్తోంది. ఉద్యోగంలో శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. పట్టుదలగా కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.