telugu navyamedia
సినిమా వార్తలు

300 అడుగుల ఎత్తు నుంచి దూకేసిన స్టార్ హీరో…!?

War

బాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోష‌న్‌, టైగ‌ర్ ష్రాఫ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం “వార్”. ఈ చిత్రంలో వాణీ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తున్న‌ది. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 2న చిత్రం విడుద‌ల కానుంది.హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం టీజర్, ట్రైలర్ లు ఇటీవల విడుదలయ్యాయి. ఇందులో హృతిక్, టైగర్ స్టంట్స్ ప్రేక్ష‌కుల రోమాలు నిక్క‌పొడుచుకునేలా చేస్తున్నాయి. వీళ్ళిద్ద‌రు చేసిన రియ‌ల్ స్టంట్స్ ప్రేక్ష‌కుల‌కి స‌రికొత్త అనుభూతిని క‌లిగిస్తున్నాయి. ఈ చిత్రంలో ఓ యాక్ష‌న్ ఎపిసోడ్‌ను పోర్చుగ‌ల్‌లోని ఓ బ్రిడ్జ్‌పై చిత్రీక‌రించారు. ఈ బ్రిడ్జ్ ఎత్తు 300 అడుగులు. ఈ బ్రిడ్జ్ పై నుండి హృతిక్ ఎలాంటి డూప్ లేకుండా జంప్ చేసేశాడ‌ట‌. ఈ విష‌యాన్ని చిత్ర ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఆనంద్ తెలిపారు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం అక్టోబ‌ర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్ష‌న్ స‌న్నివేశాలను ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేస్తూ చూస్తారు కానీ, ఆ స‌న్నివేశాల్లో న‌టించే న‌టీన‌టులు చాలా రిస్క్ చేసి క‌ష్ట‌ప‌డుతుంటారు. ఇప్పుడు బాలీవుడ్ హీరో హృతిక్ కూడా అలాంటి రిస్కే చేశాడు.

Related posts