telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మెగాస్టార్ న్యూ లుక్ వైరల్

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి సరికొత్త లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల “బ్లఫ్ మాస్టర్” సినిమా చూసిన చిరు దర్శకుడిని ప్రత్యేకంగా అభినందించారు. అతనితో ఫోటోకి స్టిల్ ఇవ్వడంతో ఇంటర్నెట్ లో ఆ న్యూ లుక్ లీక్ అయ్యింది. చిరు కొత్త లుక్ చూసిన మెగా అభిమానులంతా బాస్ లుక్ సూపర్ అంటూ ఈ పిక్ ను వైరల్ చేస్తున్నారు. ఇప్పటికీ కరోనా కష్ట కాలంలో చిరు సినీ కార్మికులకు ఆర్థిక సాయం అందించారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని కూడా తన అభిమానులతో షేర్ చేస్తూ వస్తున్నారు. “ఆచార్య”లో మెయిన్ హీరోయిన్ గా రెజీనా కసాండ్రా కనిపించబోతోందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించి రెజీనాపై ఒక పాటను కూడా చిత్రీకరించారు. ఇప్పటికే ఆచార్య సినిమాలో చిరు లుక్‌కు సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. తాజాగా చిరు కొత్త లుక్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Related posts