telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాల‌కృష్ణ 106వ సినిమా యానిమేటెడ్ టీజ‌ర్

BB3

బాలయ్య-బోయపాటి అప్ కమింగ్ మూవీ బీబీ3కి టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల బాలయ్య 60వ బర్త్ డే సందర్భంగా విడుదలైన బీబీ 3 టీజర్‌కి మాస్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలయ్య నుంచి వారి అభిమానులు ఏదైతో కోరుకుంటారో.. బోయపాటి తొలి టీజర్‌తోనే అందించడంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. వీరి కాంబోలో హ్యాట్రిక్ మూవీ కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రానికి ‘మోనార్క్’ అనే టైటిల్ తొలి నుంచి ప్రచారంలో ఉండగా… తాజాగా ఈ సినిమాకు సంబంధించిన యానిమేటెడ్ టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది. ఎస్‌.ఆర్‌.ఏ1 ఎంట‌ర్‌టైన్‌మెంట్ రూపొందించిన ఈ టీజ‌ర్ అభిమానులను, ప్రేక్ష‌కుల‌ను అలరిస్తోంది. సింహా, లెజెండ్ వంటి సూప‌ర్ హిట్ చిత్రాల త‌ర్వాత బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే ఈ సినిమా ఓ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది.

Related posts