telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సిని ప్రేక్షకులకు గుడ్‌ న్యూస్‌

Theatre

కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ కుదేలైన విషయం తెలిసిందే. షూటింగ్ లు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. దాంతో  పెద్ద సినిమాలన్నీ విడుదల తేదీ లను వాయిదా వేసుకుంటూ వచ్చాయి. కొన్నిసినిమాలు డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ ను నమ్ముకొని విడుదల అయ్యాయి.  అయితే.. ఇటీవలే కేవలం 50 శాతం కెపాసిటీ తోనే థియేటర్లు నడపడానికి అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఫిబ్రవరి 1 నుంచి 100 శాతం ఆక్సుపెన్సీతో థియేటర్లు నడుపుకోవచ్చని చెప్పింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా 100 శాతం ఆక్సుపెన్సీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. సినిమాలు, థియేటర్లు, మల్టీఫెక్స్‌లలో 100 శాతం సీట్లను నింపుకోవడానికి అనుమతి ఇస్తున్నట్లు అందులో స్పష్టం చేసింది. దీంతో సిని పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ ఆనందం మిన్నంటింది. 

Related posts