telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఆదిపురుష్” టైటిల్ ప్రకటన 7:11 గంటలకే ఎందుకంటే ?

Adipurush

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ప్యాన్ ఇండియా మూవీగా ఓం రావుత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రం టైటిల్ ‘ఆదిపురుష్’… ‘మంచిపై చెడు సాధించిన విజయం’ అంటూ క్యాప్షన్ కూడా కనిపిస్తుంది. అంటూ విభిన్నంగా కనిపించే లోగోను నిన్న ఉదయం 7 గంటలా 11 నిమిషాలకు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీన్ని తెలుగు, హిందీ భాషల్లో రూపొందించి, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తామని ఇప్పటికే నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా టైటిల్ ముహూర్తం 7:11కే ఎందుకన్న విషయమై, నెట్టింట ఓ ఆసక్తికరమైన పోస్ట్ తెగ చక్కర్లు కొడుతోంది. మహావిష్ణువు దశావతారాల్లో శ్రీరాముని అవతారం ఏడవదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరానికి శ్రీరాముడు జన్మించి 11 వేల సంవత్సరాలు అయ్యాయని చరిత్రలోని గణాంకాలు చెబుతున్న వేళ, 7వ విష్ణుమూర్తి అవతారం, 11 వేల ఏళ్ల వయసును దృష్టిలో ఉంచుకునే ఉదయం 7 గంటలా 11 నిమిషాలకు టైటిల్ ను ప్రకటించారని నెటిజన్లు అంటున్నారు.

Related posts