telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద…

తెలుగు రాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదిలో వరద పెరిగింది.. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండడంతో.. ఇప్పటికే శ్రీశైలం డ్యామ్‌ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక, నాగార్జునసాగర్‌కు కూడా పెద్దస్థాయిలో వరద వచ్చిచేరుతోంది.. దీంతో.. సాగర్‌ 2 క్రస్టుగేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఈ సంవత్సరంలో మూడోసారి నీటిని విడుదల చేసారు అధికారులు. ప్రస్తుతం సాగర్‌కు ఇన్‌ఫ్లో రూపంలో 70,579 క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతుండగా.. 2 గేట్ల ద్వారా అదేస్థాయిలో 70,579 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0405 టీఎంసీలు కాగా… ప్రస్తుత నీటి నిల్వ 311.4474 టీఎంసీలుగా ఉంది.. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 589.80 అడుగులకు చేరింది. ఇక, సాధారణ సమయంలో సాగర్ గేట్లు ఎత్తివేశారంటే పర్యాటకులకు పండుగ.. తెలుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున పర్యటాకులకు తరలివచ్చి.. సాగర్ అందాలను వీక్షిస్తుంటారు.. ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వెళ్తుంటారు.

Related posts