వైసీపీ సర్కారు వైఖరితో రాష్ట్రానికి పరిశ్రమలు రావడంలేదని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. గుంటూరులో జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొన్నారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పాలన మొత్తం నిలిచిపోయిందని అన్నారు.
గ్రామ స్థాయి పనుల నుంచి పోలవరం వంటి పెద్ద ప్రాజెక్టు పనుల వరకు ప్రతిదీ ఆగిపోయిందని వివరించారు. గత కొన్ని నెలలుగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయిందన్నారు. రాష్ట్రంపై పెట్టుబడిదారుల విశ్వసనీయత తగ్గిపోయిందని అన్నారు. కియా వంటి పెద్ద సంస్థ తన యూనిట్ ను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రాలేదని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకొస్తారని సోమిరెడ్డి ప్రశ్నించారు.