ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సమయంలో పాకిస్థాన్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ ఆడటం కోసం ఐపీఎల్ నుండి తప్పుకుంటున్నట్లు దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడా సూచించాడు. ఐపీఎల్‌లో ఆడటం కంటే తన దేశాన్ని ఆడటానికి ప్రాధాన్యత ఇస్తానని రబాడా క్లియర్ చేశాడు. అయితే గత ఏడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచినా రబడా ఈ ఏడాది ఐపీఎల్ లో తాను ఆడటం లేదు అని హింట్ ఇచ్చాడు. అయితే ఐపీఎల్ 2021 జరిగే సమయంలోనే దక్షిణాఫ్రికా జట్టు పాకిస్థాన్ తో ద్వైపాక్షిక సిరీస్ ఆడాల్సిఉంది. దీని పై రబడా మాట్లాడుతూ… నా జట్టు కోసం ఆడటం ముఖ్యం. నేషనల్ డ్యూటీ ఫస్ట్” అని తెలిపాడు. ఢిల్లీ మాత్రమే కాకుండా చెన్నై సూపర్ కింగ్స్తో సహా ఇతర జట్ల జాబితాలో మరో ఐదుగురు దక్షిణాఫ్రికా ఆటగాళ్ళు ఉన్నారు. CSK వారి జట్టులో ఫాఫ్ డు ప్లెసిస్ మరియు పేసర్ లుంగి న్గిడి ఉన్నారు. అయితే దాదాపు ఈ ఆటగాళ్లు ఐపీఎల్ 2021 నుండి తప్పుకున్నట్టే.. ఈ విషయాన్ని ఆటగాళ్లు కానీ జట్ల యాజమాన్యం కానీ అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
ఎన్నికలు అయి పోగానే ఉత్తమ్ పీసీసీ పోస్ట్ ఉడిపోతుంది: ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డి