telugu navyamedia
సినిమా వార్తలు

సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక‌లేరు..

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో అద్భుతమైన పాటలను అందించిన ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక‌లేరు.

న్యూమోనియా కారణంగా నవంబర్ 24న సిరివెన్నెల సికింద్రాబాద్​లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయ‌న మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. 35ఏళ్ల సినీ ప్రస్థానంలో దాదాపు 100కు పైగా సినిమాల్లో దాదాపు మూడు వేలకుపైగా పాటలను రచించిన ఈ మాంత్రికుడికి 11 రాష్ట్ర నంది అవార్డులు, నాలుగు ఫిల్మ్​ఫేర్​ పురస్కారాలు వరించాయి.

Bulletin release on Sirivennela Seetharama Sastry health - finalnews24 News - Web Series Online Update - Web Series Casting & News

1986లో సిరివెన్నెల సినిమాతో పాటల రచయితగా తెలుగు తెరపై అడుగు పెట్టారు సీతారామశాస్త్రి . మొదటి సినిమానే అతని ఇంటి పేరుగా మార్చుకొని సిరివెన్నల సీతారామశాస్త్రిగా పేరుగాంచారు. అంతేకాదు ఆ సినిమాకు గాను ఉత్తమ గేయ రచయితగా అవార్డుని అందుకున్నారు.

Legendary Lyricist Sirivennela Seetharama Sastry Passes Away -

అలా మొదలైన సీతారాశాస్త్రి సినీ జర్నీలో ఎన్నో అద్భుతమైన పాటలు జాలువారాయి. 2019లో ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. స్వర్ణ కమలం, గాయం, శుభలగ్నం, సింధూరం, చక్రం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి ఎన్నో సినిమాల్లోని పాటలకు గాను సిరివెన్నెల నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. రామ్‌చ‌ర‌ణ్ ఎన్టీఆర్ న‌టించిన ఆ ర్ఆర్ఆర్ మూవీలోని ‘దోస్తీ’ పాట లిరిక్స్ ప్రతి ఒక్కరినీ ఆక‌ట్టుకుంది.ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Related posts