telugu navyamedia
సినిమా వార్తలు

లిప్ లాక్ కోసం తమన్నా ఎదురు చూపులు… ఈ హీరోతోనేనట…!

Tamanna images
టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి తమన్నా. తెలుగులోనే తమిళ, హిందీ భాషల్లో, ప్రైవేట్ ఆల్బమ్స్, యాడ్స్ లలో కూడా నటించింది. అయితే ఈ మిల్కీ బ్యూటీ వెండితెరపై ముద్దుసీన్లకు మాత్రం దూరంగా ఉంది. తమన్నా పెట్టే షరతులతో ముద్దు సీన్లకు నో చెప్పడమే ఇప్పటి వరకు ఆమె నటించిన చిత్రాల్లో ముద్దు సీన్లు లేకపోవడానికి కారణం. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో ముద్దు సన్నివేశాలు సాధారణం అయిపోయాయి. బాలీవుడ్ లో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. 
కానీ తమన్నా ఇప్పటికి కూడా లిప్ లాక్ సన్నివేశాలలో నటించను అనే చెప్తోంది. అయితే ఒకేఒక్క హీరోతో మాత్రమే ముద్దు సన్నివేశాల్లో నటిస్తుందట ఈ ముద్దుగుమ్మ. అతనెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో, గ్రీకువీరుడు హృతిక్ రోషన్… అతడితో సినిమా చేసే అవకాశం వస్తే ముద్దు సన్నివేశాల్లో నటించడానికి ఏమాత్రం అడ్డు చెప్పనని అంటోంది తమన్నా. హృతిక్ అంటే తనకు పిచ్చి అభిమానమని, కొంతకాలం క్రితం హృతిక్ ను చూసిన తమన్నాకు నోటమాట రాలేదట. హృతిక్ రోషన్ కు పెద్ద అభిమానిని అంటూ తన అభిమానాన్ని వెల్లడించింది తమన్నా.

Related posts