telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“వోడ్కా నా పెగ్ లోకి రావాలి.. ఫిగర్ నా పక్కలోకి రావాలి”… “పరాన్నజీవి” టీజర్

Parannajeevi

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకి కౌంటర్ గా ”పరాన్నజీవి” అనే సినిమాను ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ నూతన్ నాయుడు తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ‘పరాన్నజీవి’ టైటిల్ సాంగ్ కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో ఆర్జీవీ పాత్రలో జబర్ధస్త్ కమెడియన్ షకలక శంకర్ నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. టీజర్ మొత్తం షకలక శంకర్ ఒక్కడి మీదే కట్ చేసారు. ”వాడుకోవడం నాకు వోడ్కాతో పెట్టిన విద్య.. లక్ష్మీ బాంబుతో బాబు గారినే బద్నామ్ చేశాను.. శివంగి శ్రీరెడ్డిని సినిమా స్టార్ పై శివాలెత్తేలా చేశాను.. కత్తి మహేష్ ని కత్తి దూసేలా చేశాను.. స్క్రిప్ట్ నాది స్క్రీన్ ప్లే నాది.. ఫైటింగ్ వాళ్ళది ఛీటింగ్ నాది.. వాడుకోవడంలో వాయివరసలు లేవ్.. వోడ్కా నా పెగ్ లోకి రావాలి.. ఫిగర్ నా పక్కలోకి రావాలి” అనే డైలాగ్స్ ఆర్జీవీ మేనరిజంతో చెప్పించారు. ఇదిలా ఉండగా వర్మ ‘పవర్ స్టార్’ సినిమా జూలై 25న ఉదయం 11 గంటలకు ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో రిలీజ్ అవుతుండగా ‘పరాన్నజీవి’ సినిమా కూడా అదే రోజు అదే సమయానికి శ్రేయాస్ ఈటీ ఏటీటీలో విడుదల చేస్తున్నారు.

Related posts