telugu navyamedia
సినిమా వార్తలు

చరణ్ కు అమితాబ్ బర్త్ డే గిఫ్ట్

Ram-charan-with-Amitab-Bacchan

ఈరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 34వ పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు సినిమా ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు అభిమానుల నుంచి చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ రామ్ చరణ్ కు ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. “చరణ్‌ దిస్‌ ఈజ్‌ అమితాబ్‌.. ఈరోజు నీ పుట్టినరోజు. ఆల్‌ ది బెస్ట్‌. మున్ముందు నువ్వు చేసే పనిలో మరెన్నో విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నాను. నా నుంచి, నా ముంబయి కుటుంబం నుంచి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు వండర్‌ఫుల్‌ వ్యక్తివి. నీ వయసెంతో నాకు తెలీదు కానీ… నిన్ను చూసిన ప్రతిసారీ నీకు 18 ఏళ్లే ఉంటాయోమో అనిపిస్తుంటుంది. మీ మాతృభాషలోనే నీకు విష్‌ చేస్తాను. పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ మిస్టర్ సికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అమితాబ్ వీడియోను ట్వీట్ చేశారు.

ఈ వీడియోను చూసిన రామ్ చరణ్ సతీమణి ఉపాసన “ఇంత చక్కటి సందేశం పంపించినందుకు ధన్యవాదాలు బచ్చన్ సర్… ఇది నిజంగా స్వీటెస్ట్ గిఫ్ట్… నా చేతులు ఇప్పటికీ వణుకుతున్నాయి. చాలా ఆతృతగా ఉంది. హ్యాపీ బర్త్ డే చరణ్… లవ్ యూ” అంటూ అమితాబ్ ట్వీట్ ను అభిమానులతో షేర్ చేసుకున్నారు. చరణ్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “సైరా” చిత్రంలో అమితాబ్ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.

Related posts