telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

గ్రామాల అభివృద్ధిలో జిల్లా పరిషత్ ల భూమిక ప్రధానం .. 10కోట్ల నిధులు.. : కేసీఆర్

CM KCR Phone opposition Leaders

ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల వికాసానికి కృషి చేయడంలో అగ్రగామిగా నిలిచిన జిల్లా పరిషత్ లకు రూ.10 కోట్లు మంజూరు చేస్తమని అన్నారు. ఒకటి కంటే ఎక్కువ పరిషత్ లు ముందుకుపోతే వాళ్లకూ నిధులు మంజూరు చేస్తమని పేర్కొన్నారు. 32 జిల్లాలు కూడా అగ్రభాగాన నిలవాలని సీఎం సూచించారు. కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు, వైస్ చైర్ పర్సన్లతో ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..రాష్ట్రంలోని అన్ని గ్రామాలు గంగదేవిపల్లి, ముల్కనూర్, అంకాపూర్ లాంటి ఆదర్వ గ్రామాల మాదిరిగా మారాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. విజయాలు, అపజయాలు సర్వసాధారణం.

రాజకీయాల్లో ఉన్నవారు ప్రజలతో నిత్యసంబంధాలు కలిగి ఉండడం ప్రాథమిక లక్షణం. గతంలో జడ్పీ చైర్మన్లకు పెద్దగా పనిలేదు. ఇటీవల కేంద్ర ఆర్థిక సంఘాన్ని కలిసినపుడు మన వ్యవస్థ గురించి వివరించాను. జడ్పీ చైర్మన్లకు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ర్యాంక్ ఇచ్చామని చెప్పిన. వాళ్లు ఇకముందు క్రియాశీలకంగా పనిచేస్తారని కూడా చెప్పానని సీఎం తెలిపారు. ఇంత ఏకపక్షంగా 32 జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలు ఎప్పుడూ రాలేదని సీఎం కేసీఆర్ అన్నారు.

పంచాయతీరాజ్ ఒక అద్భుతమైన ఉద్యమం. స్వాతంత్ర్యం వచ్చిన ఆరంభ రోజుల్లో దీన్ని రూపకల్పన చేశారు. రాష్ట్రాలకు పాలనలో స్వతంత్రత ఉండాలని.. కేంద్రీకృతపాలన క్షేత్రస్థాయిలో ఫలితాలు రాబట్టలేదు. ఎక్కడికక్కడే అభివృద్ధి జరగాలని ఒక అద్బుతమైన ఉద్యమానికి ప్రాణం పోశారు. దీనికి మొట్టమొదటి పేరు కమ్యూనిటీ డెవలప్ మెంట్. అది వికేంద్రీకరణ జరగాలని స్థానిక స్వపరిపాలనకు శ్రీకారం చుట్టారు. పంచాయతీరాజ్ విషయంలో అవగాహనకు రావడానికి నేను ఎమ్మెల్యేగా ఉన్నపుడు ఎన్ఐఆర్డీలో శిక్షణకు వెళ్లాను. అక్కడే హాస్టల్ లో ఉండి 7 రోజుల శిక్షణా కార్యక్రమానికి హాజరయ్యాను. అలా వెళ్లడం వల్ల నాకు పూర్తి అవగాహన వచ్చిందని సీఎం కేసీఆర్ తెలిపారు.

Related posts