సుహాస్ హీరోగా నటించిన ”కలర్ ఫోటో” బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఇందులో సుహాస్ సరసన తెలుగు అమ్మాయి చాందిని చౌదరి హీరోయిన్ గా నటించగా… చాందిని దీప్తి అనే పాత్రలో నేచురల్ పెర్ఫార్మన్స్ తో స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చి ఆకట్టుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లలో చాందినీ తన నటనతో ఆడియన్స్ ని ఏడిపించింది. సీనియర్ కమెడియన్ సునీల్ విలన్ గా నటించాడు. సందీప్ రాజ్ దర్శకత్వం వహించగా, కీరవాణి తనయుడు కాళ భైరవ సంగీతం అందించాడు. అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ పై ‘హృదయ కాలేయం’ సాయి రాజేష్ నిర్మించారు. ఇటీవల `ఆహా` యాప్ ద్వారా విడుదలైన ఈ చిత్రం మంచి ఆదరణ దక్కించుకుంటోంది. ముఖ్యంగా యువతకు ఈ సినిమా బాగా నచ్చింది. కాలభైరవ సంగీతంలోని పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ `కలర్ ఫొటో` టీమ్‌ను అభినందించాడు. ఆ సినిమా టీమ్‌తో కలిసి దిగిన ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. “కలర్ ఫొటో టీమ్ మొత్తానికి అభినందనలు. వెరీ స్వీట్ లవ్‌స్టోరీ. చక్కని సంగీతం, అద్భుతమైన నటన, భావోద్వేగాలతో కూడిన చక్కని సినిమా. చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా చూసినందుకు సంతోషంగా ఉంది” అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు.
Congratulations to the entire team of #ColourPhoto . Very sweet love story & a haunting film with amazing music , emotions and performances. Very happy to see a good film in a long time. @ActorSuhas @SandeepRaaaj @iChandiniC @SaiRazesh @harshachemudu @kaalabhairava7 pic.twitter.com/mWuFVMbN4o
— Allu Arjun (@alluarjun) October 31, 2020
ఇక రీమిక్స్ సాంగ్స్ కు దూరం… బాలూ గారు తిడుతున్నారు : తమన్