నాగార్జున తన కొత్త సినిమా ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ నిమిత్తం మనాలి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడే లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేయడంతో మూడు వారాల పాటు తిరిగి రానని కన్ఫర్మ్ చేస్తూ స్వయంగా వీడియో వదిలారు. దీంతో ఆ మూడు వారాలు బిగ్ బాస్ పరిస్థితి ఏంటి? అనే ఆలోచనలో పడిన ఆడియన్స్‌ని గత వారం అక్కినేని కోడలు సమంత అలరించింది. హోస్ట్‌గా తొలిసారి చేసిన సామ్.. బుల్లితెర ప్రేక్షకుల చేత భేష్ అనిపించుకుంది. దీంతో ఈ వారం బిగ్ బాస్ తెరపై అక్కినేని కోడలు పిల్ల సమంతనే మళ్ళీ మ్యాజిక్ చేస్తుందా? లేక ఆమె స్థానంలో వేరే ఎవరైనా వస్తారా? అనే ప్రశ్నలకు ఫుల్‌స్టాప్ పెడుతూ బిగ్ బాస్ టీం నాగార్జునకు స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేసి రప్పించిందని టాక్. ఈ మేరకు మనాలి నుంచి ఆయన ప్రత్యేకంగా హెలికాఫ్టర్‌లో బయల్దేరిన వీడియో షేర్ చేసి.. ఈ రోజు (శనివారం) రాత్రి 9 గంటలకు బిగ్ బాస్ తెరపై నాగార్జుననే చూడబోతున్నాం అని తెలిపింది బిగ్ బాస్ మేనేజ్‌మెంట్. ఈ మేరకు ‘కింగ్ ఈజ్ బ్యాక్’ అంటూ ఆసక్తికర ట్యాగ్ లైన్ జోడించి బిగ్ బాస్ అభిమానులను హూషారెత్తించారు.
King is back in style for #BiggBossTelugu4 shoot
Today at 9 PM on @StarMaa pic.twitter.com/loFBC2WJHt
— starmaa (@StarMaa) October 31, 2020