telugu navyamedia
వార్తలు విద్యా వార్తలు సామాజిక

నీట్‌ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువు పొడిగింపు

exam hall

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఇతర మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశం కల్పించే నీట్‌(నేషనల్‌ ఎలిజబిలిటీ కం ఎంట్రన్‌ టెస్ట్‌) పరీక్షకు దరఖాస్తు గడువు పెరిగింది. ఈ నెల 6వ తేదీ రాత్రి 11.50 గంటలకు వరకు నీట్ దరఖాస్తు గడువును పెంచారు. ఈ గడువు మొదట 31 డిసెంబర్‌, 2019గా ఉంది. కాగా వెబ్‌సైట్‌లో రద్దీ కారణంగా అనేకమంది విద్యార్థులు సకాలంలో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోలేకపోయారు. దీంతో అనేక విజ్ఞప్తుల మేరకు నీట్‌ దరఖాస్తు గడువును పొడిగించినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణలకు ఇప్పటికే ప్రకటించిన జనవరి 15 నుంచి 31 వరకు ఉంటుందని తెలిపారు. కశ్మీర్‌ లోయ, లేహ్‌, కార్గిల్‌ అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీఏ) సూచించిన నోడల్‌ సెంటర్లలో తమ దరఖాస్తులు సమర్పించాల్సిందిగా అధికారులు పేర్కొన్నారు.

Related posts