telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

తొమ్మిదో రోజు పెరిగిన ఇంధన ధరలు

మన దేశంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు మండిపోతున్నాయి. ఈ ఏడాది మొదటి నుంచే విపరీతంగా పెట్రోలు ధరలు పెరుగుతున్నాయి. అయితే తాజాగా దేశవ్యాప్తంగా మరోసారి డీజిల్‌, పెట్రోలు ధరలు పెరిగిపోయాయి. రోజువారీ సమీక్షలో భాగంగా టర్‌ పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసల మేర పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 89.29కి చేరింది. అలాగే డీజిల్‌ ధర రూ.79.95 కు పెరిగింది. ఇక ముంబైలో పెట్రోల్‌ ధర రూ. 95.75, డీజిల్‌ రూ. 86. 98 కి చేరాయి. ఇక హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.10 గా ఉండగా.. డీజిల్‌ ధర రూ. 87.20 కి చేరింది. ఏపీలోని విజయవాడ నగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 95.55 కాగా.. లీటర్‌ డీజిల్‌ ధర రూ. 89.09 గా ఉంది. ఇక ఏపీలో ప్రత్యేక ఛార్జ్‌లు కూడా వసూలు చేస్తూ ఉండటంతో మిగతా రాష్ట్రాల కంటే కాస్త ఎక్కువగానే ఉంది. కాగా.. ఇంధన ధరలు ఇలా అమాంతం పెరుగుతూ పోతుంటే సామన్యుడిపై తీవ్ర ప్రభావం పడుతోందని ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శలు చేస్తున్నాయి.

Related posts