telugu navyamedia
ఆంధ్ర వార్తలు

పీఆర్సీ, రిటైర్‌మెంట్ వయసు పెంపుకు కేబినెట్‌ ఆమోదం..

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం ఉదయం ప్రారంభమైన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ముగిసింది. దాదాపు 2 గంట‌ల‌కు పైగా జ‌రిగిన ఈ స‌మావేశంలో  ప‌లు కీలక అంశాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు…

ఇందులో తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన జీవోల ప్రకారం పీఆర్సీని ఆమోదిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ మరో నిర్ణయం ఆమోదించింది. కోవిడ్ కారణంగా చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ లోగా కారుణ్య నియామకాలు చేపట్టేందుకు కేబినేట్ ఆమోదం. తెలిపింది. అలాగే జగనన్న టౌన్ షిప్ లో ప్రభుత్వ ఉద్యోగులకు 10శాతం , పెన్షనర్స్ కోసం 5 శాతం రిజర్వ్ చేయడంతో పాటు 20శాతం రిబేట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

Bill passed to judicially scrutinize projects valued over ₹100 crore in AP

అలాగే జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్‌లలో ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం, ఉద్యోగులకు 20 శాతం రిబేట్‌.. పెన్షనర్లకు 5 శాతం ప్లాట్లు కేటాయిస్తునట్లు తెలిపారు. ‘ఈబీసీ నేస్తం’ చెల్లింపులతో పాటు వారానికి నాలుగు సర్వీసులు నడిచేలా ఇండిగో సంస్థతో ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఏపీ మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే…

*. ఈబీసీ నేస్తం అమలుకు క్యాబినెట్ ఆమోదం
*జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో స్వల్ప మార్పులు. రెండు వాయిదాల్లో ఓటీఎస్ సొమ్ము చెల్లించేలా వెసులుబాటుకు ఆమోదం.
*. ఈనెల 25న ఈబీసీ నేస్తం పథకానికి సీఎం జగన్‌ శ్రీకారం
* 16 వైద్య కళాశాలల నిర్మాణానికి కేబినెట్‌ ఆమోదం
* ఇప్పటికే ఉన్న 11 వైద్య కళాశాలల అభివృద్ధికి కేబినెట్‌ ఆమోదం
* వైద్య కళాశాలలకు రూ, 7,880 కోట్లు ఖర్చు చేసేందుకు ఆమోదం
* ప్రస్తుత వైద్య కళాశాలల అభివృద్ధికి రూ. 3,820 కోట్లు కేటాయింపు
* గ్రామీణ ప్రాంతాల్లో వాయిదాల్లో ఓటీఎస్‌ చెల్లింపునకు ఆమోదం
* రైతుల నుండి ధాన్యం కొనుగోళ్ల కోసం రూ. 5 వేల కోట్లు
* ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో రైతుకు చెల్లింపు
* ఉద్యోగుల నూతన పీఆర్సీకి ఆమోదం
* కోవిడ్‌తో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకం
* అగ్రవర్ణాల పేద మహిళలకు 45 వేలు ఆర్థిక సహాయం
* ఏటా 15 వేలు చొప్పున 45 ఏళ్ళ నుండి 60 ఏళ్ల మధ్య పేద మహిళలకు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయం
* కిదాంబి శ్రీకాంత్‌ స్పోర్ట్స్‌ అకాడమీకి తిరుపతిలో ఐదెకరాల భూమి కేటాయింపు
* విశాఖలో అదాని డేటా సెంటర్‌కు భూ కేటాయింపు ప్రతిపాదనకు ఆమోదం
* వన్‌ డిస్ట్రిక్ట్‌-వన్‌ మెడికల్‌ కాలేజీ ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం

*జనవరి 1, 2022 నుంచి పెన్షన్‌ను 2,250 నుంచి రూ.2500కు పెంచిన నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
*రూ.5వేల కోట్లు రుణాల సేకరణకు ఏపీ పౌరసరఫరాల శాఖకు వెసులుబాటు కల్పిస్తూ కేబినెట్ ఆమోదం.

Related posts