telugu navyamedia
రాజకీయ

యూపీలో సీఎం అభ్యర్ధిని నేనే..ఇంకెవరైనా కన్పిస్తున్నారా?..

ఉత్తర్​ప్రదేశ్​లో జ‌ర‌గ‌నున్న‌ అసెంబ్లీ ఎన్నిక‌ల రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా బీజేపీ నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్‌, సమాజ్‌వాదీ పార్టీ నుంచి మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ ఈసారి ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు.

ఈ క్ర‌మంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఎవరు పోటీ చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ విషయంపై ప్రియాంక గాంధీ తానే సీఎం అభ్యర్థినని పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందనడానికి ఇదే సూచ‌న అయితే ఉత్తరప్రదేశ్‌లో టైటాన్స్ యుద్ధం జ‌ర‌బోతుందని చెప్పాలి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ నుండి పోటీ చేస్తారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ బహుశా కర్హాల్ నుండి పోటీ చేస్తారు.

యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం పార్టీ యూత్‌ మేనిఫెస్టోను రాహుల్‌ గాంధీ , ప్రియాంక గాంధీ వాద్రా విడుదల చేశారు. అనంతరం ఇరువురూ మీడియాతో మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు ప్రియాంక స్పందిస్తూ.. ‘‘ఇంకెవరైనా కన్పిస్తున్నారా? మరి ఇంకేంటీ? ఎక్కడ చూసినా నేనే కన్పిస్తున్నానుగా..! చూడట్లేదా?’’ అని అన్నారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆమె తెలిపారు.

Dikh toh raha hai na,' Priyanka Gandhi's reply to 'Are you the CM face in UP?' - Hindustan Times

ప్రియాంక వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆమె పేరునే ప్రకటించడం దాదాపు ఖాయంగానే కన్పిస్తోంది. త్వరలోనే కాంగ్రెస్‌ దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది.

ఇదే జ‌రిగితే గాంధీ కుటుంబ నుంచి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం కూడా ఇదే తొలిసారి అవుతుంది.2019 లోక్‌సభ ఎన్నికల్లో, ప్రియాంక గాంధీ మొదట ప్రధాని మోదీ లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు, కానీ ఆ తర్వాత దానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు.

2019లో, ప్రియాంక గాంధీని ఉత్తరప్రదేశ్ తూర్పు భాగానికి ఇన్‌ఛార్జ్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 2020లో ఆమె మొత్తం రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.

రాష్ట్ర బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ప్రియాంక ఉత్తరప్రదేశ్‌పై దృష్టి సారించింది మరియు మహిళా సాధికారతను కాంగ్రెస్ ప్రధాన అజెండాలలో ఒకటిగా చేసింది. అయితే ఎన్నికల్లో పోటీ చేయకుండానే ప్రియాంక సీఎం పీఠాన్ని అధిష్టించవచ్చు.

ఉత్తర ప్రదేశ్‌లో ఏడు దశల్లో పోలింగ్ ఉంటుంది. ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో ఆ రాష్ట్ర ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అధికారం ఎవరిని వరిస్తుందనేది అదే నెల 10వ తేదీన తెలియ‌నుంది.

Related posts