telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఉద్యోగుల‌తో సంప్ర‌దింపులు జ‌రిపేందుకు ఏపీ ప్ర‌భుత్వం క‌మిటి ఏర్పాటు

ఏపీలో ప్రభుత్వం ఫిట్‌మెంట్‌, పీఆర్సీ ప్ర‌క‌ట‌న‌ ఆమోదయోగ్యంగా లేదని ఉద్యోగ సంఘాలు మ‌రోసారి స‌మ్మెకు వెళ్లాల‌ని నిర్ణ‌యించారు. ఇవాళ స‌మావేశ‌మైన ఉద్యోగసంఘాల ప్రతినిధులు.. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మ‌ళ్లీ స‌మ్మె బాటకు వెళ్లాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు.

సమ్మె సైరన్ : ఉద్యమానికి ఆ పేరు పెట్టిన ఉద్యోగ సంఘాలు..

ఈ క్ర‌మంలో ఏపీ ప్ర‌భుత్వం ఉద్యోగులతో సంప్రదింపులు జ‌రిపి న‌చ్చ‌చెప్పేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.దీనిలో భాగంగా మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సిఎస్ సమీర్ శర్మలను కమిటీలో సభ్యులుగా చేర్చారు. ఉద్యోగులకు వాస్తవ పరిస్థితులు వివరించి, అపోహలు తొలగించేందుకు ఈ కమిటీ ఏర్పాటు చేశారు.

Related posts