telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రామోజీరావు గారి అంత్యక్రియలు అధికారలాంఛనాలతో నిర్వహించాలి అని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది- రేవంత్ రెడ్డి

 

ఈనాడు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీరావు గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది అని అనిరేవంత్ రెడ్డి ట్వీట్ ద్వారా తెలిపారు .

తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుంది.

తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు గారు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను  అని రేవంత్ రెడ్డి ట్వీట్ ద్వారా తెలిపారు .

రామోజీరావు గారి అంత్యక్రియలు అధికారలాంఛనాలతో నిర్వహించాలి అని సీ ఎస్ కు ఆదేశాలు జారీచేశారు.

Related posts