telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

రామతీర్ధం కేసులు టీడీపీ నేతలే నిందితులుగా తేల్చిన పోలీసులు…

chandrababu tdp ap

ఏపీలో వరుసగా ఆలయాలపై దాడులు జరగడం కలకలం రేపిన విషయం తెలిసిందే. అందులోనూ ముఖ్యంగా రామతీర్దంలో కోదండ రాముని విగ్రహం ద్వంసం ఘటన రోజురోజుకి రాజకీయ రంగు పులుముకుంటుండటంతో  పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఐదు ప్రత్యే క బృందాలతో పాటు ఇంటలిజేన్స్ , సిఐడి, స్పేషల్ బ్రాంచ్  పోలీసులను రంగంలోకి దించి .. అనుమానం ఉన్న ప్రతీ ఓక్కరిని  విచారిస్తున్నారు . ఇక మరోపక్క రామతీర్ధంలో విజయసాయి రెడ్డి వాహనం మీద దాడి కేసులో.. A1గా చంద్రబాబు, Aగా అచ్చన్నాయుడు, A3గా కళా వెంకట్రావు పేరు చేర్చారు పోలీసులు..మరో 12 మందిని ముద్దాయిలుగా పోలీసులు చేర్చారు. ఇక ఇప్పటికే ఏడుగురికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మరో వైపు జిల్లాలో శాంతి బద్రతలసమస్య తలెత్త కుండా సర్వమత పెద్దలతో కలిపి  ప్రత్యేక కమిటిలను ఏర్పాటు చేసారు జిల్లా అధికారులు. రామతీర్దం పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 30 ని అమలు చేస్తున్నారు పోలీసులు. ఘటన జరిగిన బోడికోండ పైకి ఎవరినీ అనుమతించడం లేదు. జిల్లాకు చెందిన ఐదు ప్రత్యే క బృందాలతో పాటు ఇంటలిజేన్స్ , సిఐడి, స్పేషల్ బ్రాంచ్  పోలీసులను రంగంలోకి దించింది ప్రభుత్వం. చూడాలి మరి ఈ విషయం పై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారు అనేది.

Related posts