telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత వల్లే ఇసుక సమస్య: కన్నా

Kanna laxminarayana

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక సమస్య పై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇసుక కొరత వల్ల లక్షల మండి భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని టీడీపీ, జనసేన పార్టీలు మండిపడుతున్నాయి. తాజాగా ఈ అంశం పై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత వల్లే ఇసుక సమస్య వచ్చిందని ఆరోపించారు. నిర్మాణరంగంపై ఆధారపడ్డ కుటుంబాలకు రూ.10 వేలు ఇవ్వాలని కన్నా డిమాండ్ చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి సాంకేతికంగా వీలుకాదని కన్నా తేల్చిచెప్పారు. హోదా అంశాన్ని రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయని ఆరోపించారు. ఏపీలో 2024 నాటికి బీజేపీనే ప్రత్యామ్నాయమని చెప్పారు. ఎన్నికలప్పుడే రాజకీయం చేద్దామని, రాష్ట్రాభివృద్ధికి అన్ని పార్టీలు కలిసి రావాలని కన్నా పిలుపునిచ్చారు.

Related posts