telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం ..స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యుల నినాదాలు..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు తొలిరోజు ప్రారంభమయ్యాయి. శాసనసభ ప్రారంభం కాగానే.. స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే నిరుద్యోగ సమస్యపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానం ఇచ్చింది. 

తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చ జరపాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు..టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో గొడవ మొదలైంది.

స్పీకర్‌ పోడియం దగ్గర దూసుకెళ్లి టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. జాబ్‌ ఎక్కడ జగన్‌ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు..నిరుద్యోగులను మోసం చేసిన సీఎం డౌన్ డౌన్ నినాదాలు చేస్తూనే ఉన్నారు.

జాబ్ క్యాలెండర్.. జాబ్ లెస్ క్యాలెండర్‌గా మారిందని టీడీపీ నినాదాలు చేసింది. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత చూద్దామని స్పీకర్ తమ్మినేని సీతారాం పదే పదే చెప్పినా టీడీపీ వినలేదు.

AP Assembly session begins Tdp continues Protest

ప్లకార్డులు పట్టుకుని రావద్దని స్పీకర్ టీడీపీ నేతలను హెచ్చరించారు. స్పీకర్ పోడియం వద్దకు చేరి టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తుండటంతో ప్రశ్నోత్తరాలు కొంత సేపు నిలిపేశారు.

తాము అఅధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నర లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ నిరుద్యోగం ఉంది తప్పించి, సాధారణ ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు.

మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడుతూ ప్రశ్నోత్తరాల సమయంలో సభకు ఆటంకం కల్గించడమేంటని ప్రశ్నించారు. కరోనా సమయంలో ప్రశ్నోత్తరాలను తొలగిస్తే ఎందుకు తొలగించారని ప్రశ్నించిన టీడీపీ సభ్యులు ఇప్పుడు వాటిని అడ్డుకోవడమేంటని నిలదీశారు.

Related posts