telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మహిళా సాధికారితకు కట్టుబడి ఉన్నాం-సీఎం వైఎస్ జగన్

తమ ప్రభుత్వం మహిళల సాధికారిత కోసం కట్టుబడి ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. అంతర్జాతీయ మ‌హిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విజ‌య‌వాడ‌ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ప్రసంగించారు…రాష్ర్టంలో ఉన్న ప్రతీ అక్క, ప్రతీ చెల్లెమ్మకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఆధునిక‌ ఏపీ లో మహిళలకు దక్కిన గౌరవానికి రాష్ట్ర మహిళలందరూ ప్రతినిధులే. స్టేజి మీద కాదు …స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రజా ప్రతినిధులే. ప్రతి ఒక్కరూ సాధికారతకు ప్రతినిధులుగా ఉన్న‌ మహిళలే. ప్రతి మహిళలో ఆత్మవిశ్వాసం కనిపిస్తోందని తెలిపారు. సాధికారతకు మహిళలు ప్రతినిధులుగా నిలుస్తున్నారని అన్నారు.

ఇక్కడ మహిళా‌ జనసంద్రం చూస్తుంటే ఐన్‌రైన్డ్ అనే మహిళ‌ మాటలు గుర్తొస్తున్నాయన్నారు. ‘‘మహిళగా నన్ను ఎవరు గుర్తిస్తారన్నది కాదు.. ఆత్మవిశ్వాసం ఉన్న నన్ను ఎవరు ఆపగలరు… అని ఐన్‌రైన్డ్ అన్నారని’’ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

నా ముందున్న వారిలో 99% మంది మహిళలు ఏదో ఒక పదవిలో ఉన్నారు. దేశ చరిత్రలోనే ఇంత మంది మహిళా ప్రజాప్రతినిధులతో సభ జరిగి ఉండదని తెలిపారు. 1993 నుంచీ చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ కు పార్లమెంటులో బిల్లులు పెడుతూనే ఉన్నారు.. కాని అమలు మాత్రం చేయలేదు.

మహిళల కోసం చట్టం చేసిన తొలి ప్రభుత్వం మనదేనని అన్నారు.మహిళలకు 51 శాతం పదవులు కేటాయించాలని చట్టం చేశామని తెలిపారు. మహిళల కోసం చట్టం చేసిన తొలి ప్రభుత్వం మనదేనని అన్నారు.1356 పదవుల్లో‌ 51% మహిళలకే ఇచ్చాం అన్నారు జగన్.

శాసనమండలి తొలి వైస్ చైర్మన్‌గా జాఖియా ఖానమ్‌ను నియమించామని, రాష్ట్ర తొలి మహిళా డిప్యూటీ సీఎం, హోంమంత్రి, సీఎస్, ఎలక్షన్ అధికారిగా పదవులు ఇచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని సీఎం జగన్ పేర్కొన్నారు. దేశంలో ఏపీతో సమానంగా ఏ ప్రభుత్వం మహిళలను బలపరచలేదన్నారు.

13 జడ్పీ చైర్మన్‌లతో ఏడుగురు మహిళలేనని తెలిపారు. మహిళలకు 51 శాతం పదవులు ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీ అని గుర్తుచేశారు. మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌లుగా 64 శాతం మహిళలే ఉన్నారని తెలిపారు. నామినేటెడ్‌ పోస్టులు, కాంట్రాక్టులు మహిళలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

అలాగే..అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన కింద తల్లుల ఖాతాల్లోనే నగదును జమ చేస్తున్నామని చెప్పారు. వైఎస్ఆర్ ఆసరా వడ్డీ పథకం దేశంలో ఎక్కడైనా ఉందా అని ఆయన అడిగారు.  వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద రూ. 2354 కోట్లు జమ చేశామన్నారు. తమ 34 నెలల పాలనలో మహిళలకు  1 లక్షా 18 వేల కోట్లను అందించినట్టుగా సీఎం జగన్ చెప్పారు. 

మహిళల భద్రత కోసం దిశా చట్టం తీసుకొచ్చామన్నారు. నేరాలు తగ్గాలంటే నిందితులకు శిక్షలు త్వరగా పడాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే తాము ఈ చట్టంలో ఈ మార్పులు చేశామన్నారు. దిశ చట్టాన్ని  ఆమోదం కోసం కేంద్రానికి  పంపామన్నారు.

Related posts