telugu navyamedia
ఆంధ్ర వార్తలు

‘సంగం’ బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు..

*ఉదయగిరికి వెలిగొండ ప్రాజెక్టు నీళ్లను అందిస్తాం

*త్వరలో పూర్తికాబోతున్న సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు

*అసెంబ్లీ వేదికగా ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు .ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా రెండోరోజు గౌతమ్‌రెడ్డి మృతిపై ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి తనకు వ్యక్తిగతంగా తీరని లోటని ఆయనతో ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు.  తనకు అనేక సందర్భాల్లో గౌతమ్ అండగా నిలిచారన్నారు. గౌతమ్‌రెడ్డి తనకు చిన్నప్పట్నుంచి మంచి స్నేహితుడని గుర్తు చేసుకున్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా గౌతమ్ రెడ్డి చేసేవారన్నారు.

గౌతమ్ రెడ్డి కృషి కారణంగానే రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటయ్యాయయని జగన్ చెప్పారు. ఆయన మృతి తనకు మాత్రమే కాదు పార్టీకి, ప్రభుత్వానికి కూడా లోటని జగన్ ఆవేదన చెందారు. మంచి స్నేహితుడ్ని కోల్పోవడం బాధాకరమని అన్నారు. చాలా సందర్భాల్లో గౌతమ్‌రెడ్డి తనకు అండగా నిలబడ్డారని సీఎం జగన్‌ గుర్తుచేశారు. ఆయన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించారని తెలిపారు.

వయస్సులో తన కన్నా ఒక్క సంవత్సరం పెద్దవాడైనా తనను అన్న అని గౌతమ్‌రెడ్డి ఆప్యాయంగా పిలిచేవారని సీఎం జగన్ గుర్తుచేసుకున్నారు. యూకేలోని మాంచెస్టర్ యూనివర్సిటీలో గౌతమ్‌రెడ్డి ఉన్నత చదువులు చదివారని తెలిపారు. తాను సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు తనతో పాటు గౌతమ్ నిలబడ్డారని.. ఆయన నిలబడటమే కాకుండా అతని తండ్రిని కూడా తనతో నడిపించారని జగన్ పేర్కొన్నారు.

పారిశ్రామిక మంత్రిగా గౌతమ్‌రెడ్డి చాలా కృషి​ చేశారని తెలిపారు. గౌతమ్‌రెడ్డి లేకపోయినా నెల్లూరు జిల్లా కోసం దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి కన్న కలలను నెరవేరుస్తామని సీఎం జగన్‌ అన్నారు.

వెలిగొండ ప్రాజెక్ట్‌ ద్వారా ఉదయగిరికి తాగునీటిని అందిస్తామని తెలిపారు. సంగం బ్యారేజీ పనులను మరో ఆరు వారాల్లో పూర్తి చేసి.. ఆ బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెడతామని  అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు.

Related posts