telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

tirumala temple

త్వరలో వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుమల కొండలు ఖాళీ అయ్యాయి. ఈ ఉదయం స్వామివారి సర్వదర్శనానికి కేవలం ఒకే ఒక్క కంపార్టుమెంట్ లో భక్తులు వేచి వున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి చూస్తున్న సాధారణ భక్తుల సంఖ్య కంటే రూ. 300 ప్రత్యేక దర్శనం, టైమ్ స్లాట్ దర్శనం, దివ్య దర్శనం భక్తుల సంఖ్యే అధికంగా ఉంది.

స్వామి దర్శనానికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 83 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా సుమారు రూ. 3 కోట్ల ఆదాయం లభించింది.

Related posts