హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌లో మూసివున్న పాన్‌షాప్ నుంచి రూ.70 వేల విలువైన సిగరెట్లను ఓ మహిళా దొంగలించింది. పోలీసుల కథనం ప్రకారం.. కర్మన్‌ఘాట్‌లోని మందమల్లమ్మ ఫంక్షన్ హాల్ సమీపంలో శ్రీకాంత్ పాన్‌షాప్ నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి షాపు మూసి ఇంటికెళ్లాడు.
నిన్న ఉదయం యథావిధిగా షాపు తెరిచేందుకు వచ్చిన శ్రీకాంత్..పాన్ షాప్ తలుపులు తెరచి ఉండడం చూసి షాకయ్యాడు. లోపల ఉండాల్సిన రూ. 70 వేల విలువైన సిగరెట్లు మాయమైనట్టు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. షాపులోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు సిగరెట్లు దొంగిలించింది ఓ మహిళ అని తెలిసి ఆశ్చర్యపోయారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వివేకానందరెడ్డి హత్యలో టీడీపీ నేతల ప్రమేయం: షర్మిల