telugu navyamedia
ఆంధ్ర వార్తలు

నారీ.. భేరీ సౌండ్‌.. నారావారి కర్ణభేరిలో రీసౌండ్‌ రావాలి..

*మహిళా దినోత్సవ సభలో రోజా ఆసక్తికర ప్రసంగం..
*సినిమా డైలాగ్స్‌తో ముఖ్యమంత్రిని పొగుడుతూ స్పీచ్..
*ఈ ..నారీ.. భేరీ.. సౌండ్‌.. నారావారి కర్ణభేరిలో రీసౌండ్‌ రావాలి..
* ఇందిరా గాంధీ స్టేడియంలో జై జ‌గ‌న్ జైగ‌న్ జైగ‌న్ అంటూ రోజా నినాదాలు..
*రోజా స్పీచ్‌కి స్టేజ్‌పై జగన్‌మోహన్ రెడ్డి సైతం నవ్వులే నవ్వులు
*వైఎస్ జగన్ గారి లాంటి మ‌హిళ ప‌క్ష‌పాతి ముఖ్యంత్రి దేశంలో , రాష్ర్టంలో ఎక్క‌డ చూసి ఉండ‌రు..
*జ‌గ‌న‌న్న మ‌హిళ‌లంద‌రికీ దేవుడితో స‌మానం..
*మ‌హిళా సాధికార‌త జ‌గ‌న‌న్న‌తోనే సాధ్యం

వైఎస్ జగన్ గారి లాంటి మ‌హిళ ప‌క్ష‌పాతి ముఖ్యంత్రి దేశంలో రాష్ర్టంలో ఎక్క‌డ చూసి ఉండ‌ర‌ని ఎమ్మేల్యే రోజా అన్నారు. ఈ ..నారీ.. భేరీ.. సౌండ్‌.. నారావారి కర్ణభేరిలో రీసౌండ్‌ రావాలని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో ప్రభుత్వం భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభా కార్యక్రమంలో రోజా మాట్లాడుతూ..సీఎం జగన్‌ మహిళా సాధికారతను ఆచరణలో పెట్టి చూపించారని తెలిపారు.

సీఎం జగన్‌ మహిళలను మహారాణులను చేశారని గుర్తుచేశారు. మహిళ బావుంటే, కుటుంబం బావుంటుందని నమ్మే వ్యక్తి.. సీఎం జగన్‌ అని అన్నారు. సీఎం జగన్‌ మహిళలందరికీ దేవుడితో సమానమని రోజా తెలిపారు.

“ఎవడు పడితే వాడొచ్చి ఓడిస్తానంటే ఇది మీ అడ్డా కాదు బిడ్డా.. ఇది ఆంధ్రప్రదేశ్ గడ్డ.. జగనన్న అడ్డా” అంటూ రోజా మాట్లాడటంతో సభకు హాజరైన మహిళలు ఒక్కసారిగా చప్పట్లు, అరుపులతో కార్యక్రమంలో జోష్ పెంచారు.ఎన్నికలు ఎప్పుడు పెట్టినా ఓడిస్తామంటూ టీడీపీ ప్రగల్భాలు పలుకుతుందని.. ఎవరు పడితే వాళ్లు ఓడించడానికి.. ఇది ఆంధ్రప్రదేశ్ గడ్డ.. జగనన్న అడ్డా అని.. రాష్ట్రంలోని రెండున్నర కోట్ల మంది జగన్‌కు అండగా నిలుస్తారని రోజా చెప్పారు.

“ఎవరు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో.. అతనే జగన్‌మోహన్ రెడ్డి” అని ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించిందని.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వార్ వన్‌సైడే.. ఏ ఎన్నికలు పెట్టినా వైఎస్సార్‌సీపీదే విజయం అంటూ రోజా ధీమా వ్యక్తం చేశారు. మీడియాను మేనేజ్ చేసుకుని.. తోక పార్టీలను కలుపుకున్నాం అనుకుంటే సరిపోదని అక్కడ ఉంది జగన్‌మోహన్ రెడ్డి అంటూ ప్రతిపక్షాలకు ఆమె చురకలు అంటించారు.

చంద్రబాబు ఎక్కడ.. జగనన్న ఎక్కడా.. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ బాలయ్య డైలాగ్‌తో రోజా ప్రసంగాన్ని రసవత్తరంగా మార్చారు. మహిళలకు అన్యాయం చేసిన చంద్రబాబు.. మహిళలకు అండగా నిలిచిన జగన్ బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ డైలాగ్స్ విసిరారు. డ్వాక్రా మహిళలతో పాటు మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని జగన్ నిలబెట్టుకున్నారని.. చంద్రబాబు నాయుడు కనీసం మ్యానిఫెస్టోని వెబ్‌సైట్‌లో కూడా లేకుండా చేశారని.. వచ్చే ఎన్నికల్లో కూడా జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసుకునే బాధ్యత మహిళలదేనంటూ రోజా పిలుపునిచ్చారు.

Related posts